News February 25, 2025
గద్వాల: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి

ఉమ్మడి MBNR జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. వివరాలిలా.. కొత్తకోటకు చెందిన చరణ్‌రెడ్డి, అనిల్ HYDకి వెళ్తూ బైక్ అదుపు తప్పి మృతిచెందారు. కొత్తపల్లి మండలం నిడ్జింతతండాలో వాహనం అదుపు తప్పి కిందపడటంతో మద్దూరుకు చెందిన రాములు చనిపోయారు. పెళ్లికి వచ్చిన బంధువులను తీసుకెళ్తుండగా బొలెరో వాహనం వారి బైక్‌ను ఢీకొనడంతో వడ్డేపల్లి మండల వాసి మురళి స్పాట్‌లోనే ప్రాణాలు వదిలాడు.
Similar News
News March 21, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు..!

∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు ∆} మధిర మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} సత్తుపల్లిలో మట్టా దయానంద్ పర్యటన ∆} జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.
News March 21, 2025
KMR: ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు..

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజైన గురువారం జనరల్ గ్రూప్ కు సంభందించి 6928 మంది పరీక్ష రాయాల్సి ఉండగా..148 మంది పరీక్షకు హాజరు కాలేదు. ఒకేషనల్ విభాగంలో 1093 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా, 1042 మంది మాత్రమే పరీక్ష రాశారని కామారెడ్డి జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. పరీక్షలు పూర్తి అవ్వడంతో విద్యార్థులు తమ ఇంటికి బయలుదేరారు.
News March 21, 2025
ALERT: అల్లూరి జిల్లాకు వర్ష సూచన

భగ్గమంటున్న ఎండలు, ఉక్కబోతతో అల్లాడిన అల్లూరి జిల్లా వాసులకు APSDMA చల్లటి కబురు చెప్పింది. జిల్లాలో శనివారం వడగాలులు, ఆదివారం వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. పిడుగులతో కూడిన తేలికపాటి, మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని AP డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలిపింది.