News March 30, 2024

గద్వాల: శ్రీశైలానికి జొన్నల బస్తాతో నడుస్తున్న కర్ణాటక భక్తుడు..!

image

కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా సింధగికి చెందిన మల్లికార్జున స్వామి భక్తుడు శ్రీశైలానికి 50 కేజీల జొన్నల బస్తాతో కాలినడకన బయలుదేరాడు. 200 కీ.మీ దాటి గద్వాల జిల్లా గట్టు మండలం బల్గెరకు చేరుకుని సేద తీరాడు. అక్కడి స్థానికులు జొన్నల మూటపై ఆరా తీయగా తాను పండించిన జొన్నలు స్వామికి అర్పించేందుకు తీసుకు వెళుతున్నట్లు చెప్పడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. మరో 200 KM కాలినడకన వెళ్లాల్సి ఉంది.

Similar News

News January 17, 2025

బిజినేపల్లి: నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: భాస్కర్

image

జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతి ప్రవేశ ఎంపిక పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వట్టెం నవోదయ ప్రిన్సిపల్ భాస్కర్ కుమార్ తెలిపారు. సూపరింటెండెంట్, పరిశీలకులకు బిజినేపల్లిలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 80 సీట్లకుగాను ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 6,602 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారన్నారు. ఈనెల18న ప్రవేశపరీక్ష జరుగుతుందన్నారు.

News January 16, 2025

నాగర్ కర్నూల్: అదనపు కలెక్టర్‌ బాధ్యతల స్వీకరణ

image

నాగర్ కర్నూల్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని అదనపు కలెక్టర్‌గా పి.అమరేందర్ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కలెక్టర్‌ బాదావత్ సంతోష్‌ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నల్గొండ జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేసి, జిల్లాకు అదనపు కలెక్టర్‌గా బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ ఏవో చంద్రశేఖర్, కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

News January 16, 2025

శ్రీశైలం: స్వామి అమ్మవార్లకు రావణ వాహన సేవలు

image

శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి శ్రీశైల క్షేత్రంలో గురువారం బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రంలో బ్రహ్మోత్సవాల్లో సందర్భంగా స్వామి, అమ్మవార్లకు రావణ వాహన సేవలు ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, పూజారులు, భక్తులు, స్థానికులు, తదితరులు పెద్ద ఎత్తున స్వామివారి బ్రహ్మోత్సవ సేవలో పాల్గొన్నారు.