News October 29, 2024

గద్వాల: ‘సర్పంచ్‌గా ఎన్నుకుంటే రూ.2,00,00,000 ఇస్తా’

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్థానిక ఎన్నికల జోరు మొదలైంది. గద్వాల జిల్లా ఎర్రవల్లి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా తనను ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి రూ.2 కోట్లు ఇస్తానంటూ గ్రామానికి చెందిన పూల మద్దిలేటి పోస్టు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. జోగులాంబ పొలిటికల్ న్యూస్ అనే వాట్సాప్ గ్రూపులో వచ్చిన పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జీపీ ఎన్నికల నేపథ్యంలో ఈ పోస్ట్ సర్పంచ్‌ అభ్యర్థులకు దడ పుట్టిస్తోంది.

Similar News

News November 11, 2024

కల్వకుర్తి: తాండ్రలో నేడు సదర్ సమ్మేళనం

image

కల్వకుర్తి మండలంలోని తాండ్ర గ్రామంలో ఇవాళ  సాయంత్రం 7 గంటలకు యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవస్థానం వద్ద సదర్ సమ్మేళనం, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీకృష్ణ యాదవ సంఘం నాయకులు తెలిపారు.

News November 11, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనాధగా మారిన ఇంటర్ విద్య

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇంటర్ విద్యలో జిల్లా ఇంటర్ అధికారి (DIEO) పోస్టులు మంజూరు చేయాలని ఇంటర్ ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఐదు జిల్లాల్లో ఎక్కడా జిల్లా ఇంటర్ అధికారి పోస్టులు మంజూరు కాకపోవడంతో ఇన్‌ఛార్జ్‌లతో నెట్టుకు వస్తున్నారు. దీంతో పర్యవేక్షణ కొరవడి ఇంటర్ విద్య గాడి తప్పుతోందని విమర్శలు ఉన్నాయి.

News November 11, 2024

నాగర్‌కర్నూల్: తల్లి, వదిన సహయంతో హత్య

image

అన్నను తమ్ముడు హత్య చేసిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగింది. SI నరేందర్‌రెడ్డి వివరాలు.. తిమ్మాజిపేట(M) రాళ్లచెరువుకు చెందిన శీను(40), గోపాల్ అన్నదమ్ములు. అన్న భార్యతో గోపాల్ వివాహేతర సంబంధం నేపథ్యంలో వీరి మధ్య గొడవలు జరిగేవి. శనివారం రాత్రి గోపాల్.. వదిన, తల్లి సహయంతో శీనును చంపేశాడు. మృతదేహాన్ని గోపాల్ అత్తగారింటి వద్ద పడేయటం చూసిన గ్రామస్థులు పోలీసులకు తెలిపారు. ఏడుగురిపై కేసు నమోదైంది.