News April 11, 2025
గద్వాల: హనుమాన్ శోభాయాత్రకు ఎంపీకి ఆహ్వానం

జోగులాంబ గద్వాలలో ఈనెల 12న జరగబోయే హనుమాన్ శోభాయాత్రకు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణను విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బండల వెంకట రాములు, బీజేపీ నాయకులు మీర్జా పురం వెంకటేశ్వర రెడ్డి, సంజీవ్ అయ్యా, కృష్ణం రాజు, రఘు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 22, 2025
ONGCలో 2,623 పోస్టులు.. అప్లై చేశారా?

ఆయిల్ & నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC)లో 2,623 అప్రెంటీస్ పోస్టులకు అప్లై చేయడానికి NOV 25 ఆఖరు తేదీ. ఈ నెల 17వరకు NATS పోర్టల్లో రిజిస్ట్రర్ చేసుకున్నవారు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ పాసైన వారు అర్హులు. వయసు 18-24 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ను బట్టి సడలింపు ఉంటుంది. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. వెబ్సైట్: ongcindia.com/
News November 22, 2025
ADB: ఢీకొట్టాల్సిన వేళ.. డీలాగా..!

డీసీసీ అధ్యక్షుల నియామకంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. హైకమాండ్ నిర్ణయం వాయిదా పడటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాల వారీగా పేర్లను ఖరారు చేసినప్పటికీ, చివరి ఆమోదం కోసం వేచిచూస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆలస్యం కారణంగా జిల్లాలో కార్యకలాపాలు మందగిస్తున్నాయని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల వేళ సారథి లేకపోతే అభ్యర్థులు గెలిచేదెలా అనే చర్చ మొదలైంది.
News November 22, 2025
వంటింటి చిట్కాలు

– చపాతీ పిండి మిగిలిపోతే దానిపై కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి, గాలి వెళ్లని డబ్బాలో పెట్టి ఫ్రిజ్లో ఉంచాలి.
– ఫ్రిజ్లో అక్కడక్కడ కొద్దిగా పుదీనా ఆకులు ఉంచితే దుర్వాసన రాదు.
– కూరల్లో కారం ఎక్కువైతే అందులో టేబుల్ స్పూన్ నిమ్మరసం లేదా నెయ్యి వేస్తే కారం తగ్గుతుంది.
– కాఫీ టేస్టీగా రావాలంటే డికాషన్లో చిటికెడు ఉప్పు వేయాలి.
– ఆపిల్ పండ్ల పక్కనే పెడితే అరటి పండ్లు త్వరగా పండుతాయి.


