News March 21, 2025
గద్వాల: ‘హార్డ్ కాపీలు సమర్పించాలి’

జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న కళాశాల ఉపకార వేతనాలు హార్డ్ కాపీలు ఈనెల 22 మధ్యాహ్నం 3 గంటలలోగా జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్యాలయంలో తప్పనిసరిగా సమర్పించాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రమేశ్ బాబు శుక్రవారం తెలిపారు. జిల్లాలోని కళాశాలల ప్రిన్సిపల్స్‌కు ఈ మేరకు ఓ ప్రకటనలో ఆయన తెలిపారు.
Similar News
News September 17, 2025
వరంగల్ జిల్లాలో వర్షపాతం వివరాలు

వరంగల్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం తేలికపాటి వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయం 8:30 నుంచి ఈరోజు ఉదయం 6 గంటల వరకు మొత్తం 128.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఖిల్లా వరంగల్ మండలంలో అత్యధికంగా 27.8 మి.మీ వర్షం పడగా, గీసుగొండ 18, వరంగల్ 15.8 వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 9.9 మి.మీగా నమోదైంది.
News September 17, 2025
పండగ ఆఫర్ల పేరుతో మోసాలు: ఎస్పీ

పండగ ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు సామాజిక మాధ్యమాల్లో ఇచ్చే తప్పుడు ప్రకటనలను నమ్మొద్దని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. తక్కువ ధరకే లభించే వస్తువుల ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచితుల కాల్స్, మెసేజ్‌లు, ఈమెయిళ్లకు స్పందించవద్దని, సులభంగా డబ్బులు సంపాదించే ఆశతో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడవద్దని కోరారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
News September 17, 2025
కామారెడ్డి: ఇందిరమ్మ ఇండ్లకు రూ.43.21 కోట్లు విడుదల

కామారెడ్డిలో జరిగిన ప్రజా పాలన వేడుకల్లో వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి మాట్లాడారు. ‘ఇందిరమ్మ ఇండ్లు’ పథకం అమలులో జిల్లా సాధించిన పురోగతిని వివరించారు. జిల్లాలో మొత్తం 11,621 ఇండ్లు మంజూరు కాగా, ఇప్పటికే 6,063 ఇండ్ల నిర్మాణం ప్రారంభమైందని ఆయన తెలిపారు. ఈ నిర్మాణాల కోసం ఇప్పటి వరకు లబ్ధిదారులకు రూ.43.21 కోట్లు చెల్లించినట్లు వివరించారు.