News March 16, 2025
గద్వాల: 12 మందిపై కేసు నమోదు

మద్యం మత్తులో దాడులు చేసుకున్న 12మందిపై కేసు నమోదైన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ముగ్గురు, వడ్లవీధికి చెందిన మరికొందరు, తెలుగుపేటకు చెందిన ఓ నాయకుడి అనుచరులు హోలీఆడి స్నానంచేసేందుకు కృష్ణానదికి వెళ్లారు. ఇరు వర్గాలకు వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా అక్కడా దాడులు చేసుకున్నారు. దీంతో 12మందిపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News December 3, 2025
తూ.గో. హ్యాండ్ బాల్ టీమ్ ఎంపిక

సామర్లకోట మండలం పనసపాడులో బుధవారం తూర్పుగోదావరి జిల్లా హ్యాండ్‌బాల్ టీమ్ ఎంపిక జరిగింది. ఈ ఎంపిక ప్రక్రియలో 40 మంది క్రీడాకారులు పాల్గొనగా.. 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ తెలిపారు. ఎంపికైన ఈ జట్టు కర్నూలులో జరగనున్న అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటుందని ఆయన వెల్లడించారు. ఎంపికైన క్రీడాకారులకు ఇతర క్రీడాకారులు అభినందనలు తెలిపారు.
News December 3, 2025
ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి. పాటిల్

ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ బుధవారం తనిఖీ చేశారు. ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ తనిఖీ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈవీఎంలు, వీవీప్యాట్లు ఉన్న గదిని, సీసీ కెమెరాల పనితీరును కలెక్టర్ పరిశీలించారు. అనుమతి లేనిదే ఎవరినీ లోపలికి అనుమతించవద్దని అధికారులకు సూచించారు.
News December 3, 2025
మోడల్ స్కూల్ ను తనిఖీ చేసిన అడిషనల్ డైరెక్టర్

పాల్వంచ: కిన్నెరసాని మోడల్ క్రీడా పాఠశాలను బుధవారం ట్రైబల్ వెల్ఫేర్ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి అకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల తరగతులు, రికార్డులు, హాస్టల్ నిర్వహణ, భోజన సదుపాయాలు, క్రీడా శిక్షణ వంటి కీలక అంశాలను సమగ్రంగా పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. బోధన, మెనూ ప్రకారం భోజనం, క్రీడ అభ్యాసం వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లు, నిర్వహణ పత్రాలు పరిశీలించారు.


