News March 16, 2025

గద్వాల: 12 మందిపై కేసు నమోదు

image

మద్యం మత్తులో దాడులు చేసుకున్న 12మందిపై కేసు నమోదైన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ముగ్గురు, వడ్లవీధికి చెందిన మరికొందరు, తెలుగుపేటకు చెందిన ఓ నాయకుడి అనుచరులు హోలీఆడి స్నానంచేసేందుకు కృష్ణానదికి వెళ్లారు. ఇరు వర్గాలకు వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా అక్కడా దాడులు చేసుకున్నారు. దీంతో 12మందిపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News February 9, 2026

పుట్టపర్తి SP ఫిర్యాదుల పరిష్కారానికి 90 ఫిర్యాదులు

image

పుట్టపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా SP సతీశ్ కుమార్ ఆదేశాల మేరకు సోమవారం అడిషనల్ ఎస్పీ అంకిత సురాన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 90, ఫిర్యాదులు స్వీకరించారు. అడిషనల్ ఎస్పీ ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను శ్రద్ధగా ఆలకించారు.

News February 9, 2026

మహబూబాబాద్: ఏకలవ్య పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

మహబూబాబాద్ జిల్లాలోని ఏకలవ్య పాఠశాలలో ప్రవేశాల కొరకు దరఖాస్తులు చేసుకోవాలని రీజనల్ కో-ఆర్డినేటర్ రత్న కుమారి ప్రకటనలో తెలిపారు. 2026-27 సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాల కొరకు ఆన్‌లైన్ 29న పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 20 వరకు చివరి తేదీ అని, మరిన్ని వివరాలకు https://tsemrs.telangana.gov.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని అన్నారు.

News February 9, 2026

పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు: రజిని

image

నెల్లూరు జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డిలను మాజీ మంత్రి విడదల రజిని సోమవారం పరామర్శించారు. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతోనే వారిపై అక్రమ కేసులు బనాయించి 61 రోజులుగా జైల్లో ఉంచిందని ఆమె విమర్శించారు. పోలీసులు ఐదుసార్లు బెయిల్‌ను అడ్డుకోవడం దారుణమని, వారు ఏ తప్పూ చేయలేదని రజిని స్పష్టం చేశారు. ఎంతటి వేధింపులకు గురిచేసినా భయపడకుండా న్యాయపోరాటం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.