News March 1, 2025
గద్వాల: 13 నెలల చిన్నారి మృతి

మద్దలబండలో అనుమానాస్పదంగా ఓ చిన్నారి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. ఫిబ్రవరి 27న గ్రామానికి చెందిన పవిత్రి, నరేశ్ దంపతుల 13 నెలల కుమార్తె దర్శినిని ఇంట్లో పడుకోబెట్టి పనులకెళ్లారు. మ.2 గం. వచ్చి చూసేసరికి చిన్నారి కదలిక లేకుండా పడి ఉంది. వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి చిన్నారి మృతిచెందిందని నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News March 22, 2025
చర్లపల్లి జైలులో ఖైదీలకు అవగాహన

ఖైదీలకు న్యాయసహాయంపై శనివారం చర్లపల్లి కేంద్ర కారాగారంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ జస్టిస్ బాల భాస్కరరావు, సెక్రటరీ జస్టిస్ కిరణ్‌కుమార్‌లు హాజరై ఖైదీలకు న్యాయసహాయం అవగాహన కల్పించారు. న్యాయ సహాయం కావాలంటే న్యాయసేవాధికార సంస్ధను సంప్రదించాలని సూచించారు.
News March 22, 2025
వరంగల్: గిరిజన యువకులకు మెగా జాబ్ మేళా

సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఏటూరునాగారం (ఉమ్మడి వరంగల్) పరిధిలో గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాల కోసం ఉదయం 10 గంటల నుంచి హనుమకొండ గిరిజన భవన్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రాజెక్ట్ అధికారి సుచిత్ర మిశ్రా తెలిపారు. ఆసక్తి ఉన్న యువతీయువకులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరు కాగలరని తెలిపారు.
News March 22, 2025
మిషన్ వాత్సల్య పథకానికి అర్హుల జాబితా సిద్ధం చేయాలి: కలెక్టర్

మిషన్ వాత్సల్య పథకానికి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. కలెక్టరేట్‌లో మిషన్ వాత్సల్య పథకం అర్హుల ఎంపికపై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో 216 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు కలెక్టర్‌కు అధికారులు తెలిపారు. మిషన్ వాత్సల్య పథకానికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన వారిని గుర్తించి ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.