News April 4, 2025
గద్వాల: ‘14వ తేదీ వరకు పార్టీ కార్యక్రమాలను నిర్వహించాలి’

గద్వాల జిల్లా కేంద్రంలోని BJP కార్యాలయంలో శుక్రవారం ముఖ్యకార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్నాథ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈనెల 6 నుంచి 14వ తేదీ వరకు పార్టీ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. అదే విధంగా బూత్ స్థాయి వరకు ప్రాథమిక సభ్యత్వాలను నమోదు చేయాలని పార్టీ నాయకులకు సూచించారు.
Similar News
News October 25, 2025
KSRTC బస్సుకు తప్పిన ప్రమాదం

పుట్టపర్తి మండలంలోని వెంకటగారిపల్లి గ్రామ సమీపంలో పుట్టపర్తి-గోరంట్ల ప్రధాన రహదారిపై కర్ణాటక ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. స్థానికుల వివరాల మేరకు.. పుట్టపర్తి నుంచి ప్రయాణికులతో బెంగళూరుకు వెళ్తుండగా బస్సు స్టీరింగ్ కట్ అయింది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో డివైడర్ వైపు దూసుకెళ్లి ఆగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
News October 25, 2025
ఆక్వా సాగు చెరువులు తప్పనిసరిగా CAA కింద రిజిస్టర్ కావాలి: కలెక్టర్

ఉప్పునీటి ఆక్వా సాగు చెరువులు తప్పనిసరిగా కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ (CAA) కింద రిజిస్టర్ కావాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం కలెక్టరేట్లో జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. రిజిస్టర్ కాని చెరువులకు చట్టబద్ధత ఉండదని, సీఏఏ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఆక్వా సాగు నిర్వహించాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News October 25, 2025
కృష్ణపట్నం పోర్టులో ఒకటవ ప్రమాదవ హెచ్చరిక

బంగాళాఖాతంలో ఉన్న తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తుపాను ఏర్పడే అవకాశం ఉండడంతో ఒకటవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ క్రమంలో ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్ట్లో ఒకటవ ప్రమాదవ హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.


