News March 18, 2025
గద్వాల: 7వ రోజుకు చేరిన ఎమ్మార్పీఎస్ నిరసన దీక్ష

ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ సాధనే లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గద్వాల రాజీవ్ మార్గ్‌లో చేపట్టిన నిరసన దీక్ష మంగళవారం నాటికి ఏడో రోజుకు చేరుకుంది. ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు పూడూరు చెన్నయ్య దీక్షకు మద్దతు ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు తమ ప్రభుత్వం అనుకూలం అంటూనే చట్టబద్ధత కల్పించడంలో వెనకడుగు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 12, 2025
KMR: వైద్య వృత్తిలో సేవా భావంతో పనిచేయాలి: కలెక్టర్

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల MBBS మొదటి సంవత్సర 100 మంది విద్యార్థుల కోసం బుధవారం ‘వైట్ కోట్ సెరిమనీ’, కడవెరిక్ ఓత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన విద్యార్థులకు వైట్ కోటులను అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు వైద్య వృత్తిలో సేవాభావంతో పని చేయలన్నారు.
News November 12, 2025
అభివృద్ధి పథంలో పర్యాటక రంగం కీలకం: కలెక్టర్

స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ సాకారానికి సమ్మిళిత, సుస్థిర ఆర్థిక వృద్ధి ముఖ్యమని కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. కలెక్టర్ బుధవారం ట్రెయినీ ఐఏఎస్ అధికారులతో కలిసి కొండపల్లి ఖిల్లాకు ట్రెక్కింగ్ చేశారు. వారికి ఖిల్లా చారిత్రక వైభవాన్ని వివరించారు. కొండపల్లి కోటను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు చొరవ తీసుకుంటున్నామని వివరించారు.
News November 12, 2025
బుల్లెట్ బైక్‌పై సత్యసాయి జిల్లా కలెక్టర్, ఎస్పీ

పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాల ఏర్పాట్లు ఈ నెల 13 నాటికి పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్, ఎస్పీ బుల్లెట్ బైక్‌పై వెళ్లి పనులను పరిశీలించారు. భక్తులకు, వీఐపీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.


