News April 3, 2025

గద్వాల: ‘GOVT జాబ్ కావాలా.. APPLY చేయండి..!’

image

ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ (క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్), అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ వివిధ కేటగిరీలకు ఆన్‌లైన్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి డాక్టర్ ఎం.ప్రియాంక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్‌కు 10వ తరగతి, 8వ తరగతి పాసైన వారు అర్హులన్నారు. SHARE IT

Similar News

News April 11, 2025

దండేపల్లి: గోదావరిలో స్నానానికి వెళ్లి బాలుడి మృతి

image

దండేపల్లి మండలం గూడెం గోదావరిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ముత్తె శివవర్మ (7) అనే బాలుడు మృతి చెందాడని దండేపల్లి ఎస్సై తౌసుద్దీన్ తెలిపారు. గురువారం సాయంత్రం శివవర్మ హనుమాన్ స్వాములతో కలిసి గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడన్నారు. శివవర్మ దండేపల్లి మండలం కన్నేపల్లి గ్రామానికి చెందిన ముత్తే భీమయ్య కుమారుడని ఎస్సై వివరించారు.

News April 11, 2025

సంగారెడ్డి: కాసేపట్లో ఇంటికి.. అంతలోనే విద్యార్థి మృతి

image

పిడుగుపాటుకు కొండాపూర్‌లో విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని గంగారానికి చెందిన సంతోష్ సదాశివపేటలో ఐటీఐ చదువుతున్నాడు. కళాశాల నుంచి తన స్నేహితులతో ఇంటికి వస్తుండగా భారీ వర్షం రావడంతో సదాశివపేట మండల పరిధిలోని ఒక చెట్టు కింద ఆగారు. ఉరుములతో కూడిన వర్షం కురవడంతో పిడుగుపాటుకు సంతోష్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News April 11, 2025

సంగారెడ్డి: అనారోగ్యంతో బాధపడుతూ వ్యక్తి ఆత్మహత్య

image

అనారోగ్యంతో బాధపడుతూ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కోహిర్ మండలంలో జరిగింది. కోహీర్ ఎస్ఐ సతీష్ తెలిపిన వివరాలు.. మండలంలోని కొత్తూరు ‘కె’ గ్రామానికి చెందిన మానెప్ప (58) గత కొంతకాలంగా కడుపునొప్పి, ఎదలో నొప్పితో బాధపడుతూ గురువారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య అనుషమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

error: Content is protected !!