News April 2, 2025

గద్వాల PSలో జిల్లా ఎస్పీ తనిఖీ 

image

గద్వాల జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్‌ను మంగళవారం జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. కేసుల విషయమై పలు వివరాలను అధికారులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న జైలు గదులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మొగలయ్య, సీఐ శ్రీను, ఎస్ఐ కళ్యాణ్‌రావు ఉన్నారు.

Similar News

News November 22, 2025

IIT హైదరాబాద్‌లో స్టాఫ్ నర్స్ పోస్టులు

image

<>IIT <<>>హైదరాబాద్‌లో 2 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు డిసెంబర్ 15న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.35వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: iith.ac.in

News November 22, 2025

సీఎంఆర్ సరఫరా వేగవంతం చేయండి: ADB కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లాలో కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (CMR) సరఫరాను వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాజార్షి షా మిల్లర్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ప్రభుత్వం విధించిన గడువులు ముగుస్తున్న నేపథ్యంలో మిల్లర్లు సన్నబియ్యం మిల్లింగ్‌, సిఎంఆర్‌ సరఫరా పనులను త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమయానికి సిఎంఆర్‌ సరఫరా చేయని మిల్లర్లపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

News November 22, 2025

కివీతో ఎన్నో లాభాలు

image

కొంచెం పుల్లగా, తీపిగా ఉండే కివీతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి, చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, బరువును తగ్గించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇందులోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సాయపడతాయని చెబుతున్నారు.