News September 26, 2024
గన్నవరంలో ఘోర రోడ్డు ప్రమాదం
కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని చెన్నై-కోల్‌కత్తా హైవేపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి వస్తున్న కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులు బాపట్ల జిల్లా కోటపాడుకు చెందిన మార్క్(25), మేరీ(38)గా గుర్తించారు. క్షతగాత్రుల్ని విజయవాడ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 12, 2024
కృష్ణా: దసరా.. మీ VILLAGE స్పెషల్ ఏంటి.?
దసరా పండుగ అనగానే అందరికీ పల్లెటూరు గుర్తుకు వచ్చేస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్నవారు తిరిగి సొంతూరుకు రావడం, బంధువులు, స్నేహితులు కలిసి ఊరంతా సంతోషంగా తిరుగుతూ ఉంటారు. ఊరిలో అందరినీ పలకరిస్తూ.. ఉంటే ఆ ఆనందం మాట్లల్లో చెప్పలేని సంతోషాన్ని ఇస్తుంది. ప్రతి ఊరితో ఒక్కో విధంగా పండుగను జరుపుకుంటారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.
News October 12, 2024
ఈ దసరా మీ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలి: మంత్రి కొల్లు రవీంద్ర
మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అసత్యంపై సత్యం, అధర్మంపై ధర్మం, అధైర్యంపై ధైర్యం, చెడుపై మంచి విజయం సాధించిన రోజైన విజయదశమి పర్వదినం విజయానికి సంకేతంగా నిలిచిందని కొల్లు పేర్కొన్నారు. దుర్గా మాత కరుణతో ఈ దసరా పర్వదినం అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నానన్నారు.
News October 12, 2024
విజయవాడ: శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం విశిష్టత
కనకదుర్గమ్మ అమ్మవారు శనివారం విజయ దశమి రోజున రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. రాజరాజేశ్వరీదేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవతగా మహా త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుందని పండితులు తెలిపారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా తనను కొలిచిన భక్తులకు ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను అనుగ్రహిస్తుందన్నారు. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి రాజేశ్వరి దేవి అధిష్టాన దేవత అని పండితులు చెబుతారు.