News March 22, 2024
గన్నవరంలో మాధవిరెడ్డి, వైసీపీ కార్యకర్తలకు వాగ్వాదం

గన్నవరం YCP కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. TDP నిర్వహించనున్న వర్క్‌షాపులో పాల్గొనేందుకు కడప TDP ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి విజయవాడ వచ్చారు. గన్నవరం మీదుగా వెళ్తూ అక్కడి వైసీపీ కార్యాలయం వద్ద బ్యానర్లను ఫొటోలు తీస్తుండగా ఆ పార్టీ కార్యకర్తలు గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న TDP కార్యకర్తలు అక్కడకు చేరుకోగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
Similar News
News December 15, 2025
దువ్వూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

దువ్వూరులోని మురళి నగర్ మెట్ల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సొంత పనులు కోసం నడుచుకుంటూ వెళుతున్న వీర ప్రతాపరెడ్డి, ఎల్లయ్య అనే వ్యక్తులను ప్రొద్దుటూరు వైపు నుంచి వస్తున్న బొలెరో వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఎల్లయ్యది నేలటూరు కాగా, వీర ప్రతాప్ రెడ్డిది గోపులాపురంగా స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
News December 15, 2025
ఒంటిమిట్ట వద్ద ఘోర ప్రమాదం.. యువకుడి దుర్మరణం

మండలంలోని ఒంటిమిట్ట చెరువు కట్టపై ఆదివారం రాత్రి బైకు ఢీకొని యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాలు మేరకు.. గోవిందమాల వేసుకొని తిరుమల పాత్ర వెళుతున్న ఎర్రగుంట్లకు చెందిన జగదీశ్(20)ని ఒంటిమిట్ట చెరువు కట్ట పైకి రాగానే రాజంపేట, బాసింగరిపల్లికి చెందిన కత్తి వెంకటేశ్(27) బైకుపై వేగంగా వచ్చి వెనుక వైపు నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిలో జగదీశ్ చికిత్స పొందుతూ కడప రిమ్స్‌లో మృతిచెందాడు.
News December 15, 2025
కడప కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సోమవారం కడప కలెక్టరేట్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి సభా భవన్లో జరిగే కార్యక్రమానికి జిల్లా ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. అర్జీదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చునన్నారు. కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా జరుగుతుందన్నారు.


