News November 10, 2024
గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష

గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణ పనులపై సీఎం చంద్రబాబు శనివారం సమీక్ష నిర్వహించారు. ఇందులో కేంద్ర మంత్రి రామ్మోహన్, మంత్రి జనార్ధనరెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రజెంటేషన్ ద్వారా ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరును, పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. ఎయిర్పోర్టులో జరుగుతున్న న్యూ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులు 2025 జూన్ నాటికి పూర్తి చేయాలని సీఎం అధికారులకు ఈ సమీక్షలో సూచించారు.
Similar News
News November 14, 2025
అప్పుడు జోగి రవాణా అయితే ఇప్పుడు ఎవరి రవాణా.?

పెడన నియోజకవర్గంలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన బుసక రవాణా నేటికీ కొనసాగుతూనే ఉంది. కూటమి నాయకుల ఆరోపణల ప్రకారం, వైసీపీ ప్రభుత్వ కాలంలో జరిగిన బుసక రవాణా మొత్తం అప్పటి మంత్రి జోగి రమేశ్ కనుసన్నల్లో జరిగిందని ఆరోపిస్తున్నారు. దీనికి ప్రతిస్పందించిన వైసీపీ నాయకులు, బుసక రవాణా నేటికి కూడా అలాగే కొనసాగుతుంది. అప్పుగు జోగి కారణం అయితే, నేడు జరుగుతున్న రవాణాకు బాధ్యత ఎవరిది.? అని ప్రశ్నిస్తున్నారు.
News November 14, 2025
స్వచ్ఛ ఆంధ్రలో ప్రతి అధికారి పాల్గొనాలి: కలెక్టర్

స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల మూడవ శనివారం నాడు నిర్వహించే శుభ్రత కార్యక్రమంలో అధికారులందరూ తప్పనిసరిగా పాల్గొనాలని కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. గురువారం ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహణ, భవనాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై చర్చించారు.
News November 13, 2025
కృష్ణా: హత్య కేసులో ఏడుగురికి జీవిత ఖైదు

హత్య కేసులో ఏడుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కృష్ణా జిల్లా సెషన్స్ జడ్జి గోపి సంచలన తీర్పు ఇచ్చారు. బందరు (M) బుద్దాలపాలెంకు చెందిన కాగిత రామ్మోహనరావు 2013 ఫిబ్రవరి 28న దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న శొంఠి పైడేశ్వరరావు, బొర్రా శ్రీనివాసరావు, బొర్రా స్వామికృష్ణ, కాగిత సోమయ్య, శొంఠి వీర వెంకటేశ్వరరావు, శొంఠి వీరాంజనేయులు, శొంఠి ముసలయ్యకు జీవిత ఖైదు విధించారు.


