News November 10, 2024

గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష

image

గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణ పనులపై సీఎం చంద్రబాబు శనివారం సమీక్ష నిర్వహించారు. ఇందులో కేంద్ర మంత్రి రామ్మోహన్, మంత్రి జనార్ధనరెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రజెంటేషన్ ద్వారా ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరును, పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. ఎయిర్‌పోర్టులో జరుగుతున్న న్యూ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులు 2025 జూన్ నాటికి పూర్తి చేయాలని సీఎం అధికారులకు ఈ సమీక్షలో సూచించారు. 

Similar News

News December 6, 2024

ఫేక్ పాస్‌పోర్టుతో చిక్కిన కృష్ణా జిల్లా మహిళ

image

ఓ మహిళ ఫేక్ పాస్‌పోర్టుతో విదేశాల నుంచి వచ్చిన ఘటన ఇది. కృష్ణా జిల్లా ఘంటసాలకు చెందిన కనకదుర్గ(36) సింగపూర్ వెళ్లారు. బుధవారం సాయంత్రం తిరిగి చెన్నైకి వచ్చారు. అక్కడి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు చెకింగ్ చేయగా.. కనకదుర్గది ఫేక్ పాస్‌పోర్ట్ అని తేలింది. వేరే వ్యక్తి పాస్‌పోర్ట్‌లో ఈమె ఫొటో పెట్టి సింగపూర్ వెళ్లినట్లు గుర్తించారు. నాగేశ్వరరావు అనే వ్యక్తి ఈ ఫేక్ పాస్‌పోర్ట్ చేసినట్లు సమాచారం.

News December 6, 2024

కృష్ణా: ప్రతి శని, ఆదివారాల్లో ‘శ్రీ వైష్ణవి దర్శిని’ స్పెషల్ సర్వీసులు

image

ధనుర్మాసం సందర్భంగా ప్రముఖ వైష్ణవ ఆలయాలైన ద్వారకా తిరుమల, వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, అన్నవరం శ్రీ సత్యనారాయణస్వామి ఆలయాలను దర్శించేందుకు ‘శ్రీ వైష్ణవ దర్శిని’ పేరుతో ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను ప్రతి శని, ఆదివారాల్లో నడపనున్నట్టు కృష్ణాజిల్లా ప్రజా రవాణాధికారిణి వాణిశ్రీ గురువారం తెలిపారు. జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు నడపడం జరుగుతుందన్నారు. 

News December 5, 2024

రెవెన్యూ శాఖ ప్రతిష్ఠ పెంచే విధంగా రెవెన్యూ సదస్సులు: కలెక్టర్

image

జిల్లాలో రెవెన్యూ శాఖ ప్రతిష్ఠ పెంచే విధంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. భూ వివాదాలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే రెవెన్యూ సదస్సుల లక్ష్యమని అన్నారు. గురువారం ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఇతర అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో రెవెన్యూ సదస్సులు, మెగా పేరెంట్స్‌డే కార్యక్రమాల నిర్వహణపై మార్గ నిర్దేశం చేశారు.