News June 15, 2024
గన్నవరం ఎయిర్‌పోర్ట్ భద్రత CISFకి అప్పగించిన AAI
గన్నవరం ఎయిర్‌పోర్ట్ భద్రత బాధ్యతలను ఇకపై CISF (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) పర్యవేక్షించనుంది. ఈ మేరకు విమానాశ్రయ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంత రెడ్డి రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. ఎయిర్‌పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా(AAI) ఆదేశాల మేరకు విమానాశ్రయ భద్రత బాధ్యతలు జూలై 2 నుంచి CISF ఆధీనంలో ఉంటాయని లక్ష్మీకాంత రెడ్డి స్పష్టం చేశారు.
Similar News
News September 14, 2024
ఈ నెల 18న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
ఈ నెల 18వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ నెల 15వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా ప్రతిపాదనలు పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, ప్రభుత్వ శాఖలకు ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.
News September 14, 2024
విజయవాడ: ధనుష్ సినిమా మళ్లీ థియేటర్లలోకి వస్తోంది
ధనుష్, శృతిహాసన్ జంటగా నటించిన ‘3’ (2012) సినిమా సెప్టెంబర్ 14న రీరిలీజ్ కానుంది. సెప్టెంబర్ 14 నుంచి 16 వరకు విజయవాడలోని నాలుగు థియేటర్‌లలో ఈ సినిమా ప్రదర్శించనున్నారు. కాగా ఈ చిత్రంలోని “వై దిస్ కొలవెరి”తో పాటు ఇతర పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో విజయవాడలో ఈ సినిమా టికెట్లు ఆన్‌లైన్‌లో వేగంగా అమ్ముడవుతున్నాయి.
News September 14, 2024
కృష్ణా జిల్లా TODAY TOP NEWS
* విజయవాడలో బాడీ మసాజ్ సెంటర్‌పై పోలీసుల దాడి
* విజయవాడ రైల్వేస్టేషన్‌కు స్పెషల్ గుర్తింపు
* కృష్ణా జిల్లాలో కలకలం.. ఒకే ఇంట్లో 100పాములు
* ఇబ్రహీంపట్నంలో రోడ్డు ప్రమాదం(వీడియో)
* జోగి రమేశ్, అవినాశ్‌కు సుప్రీంలో ఊరట
* మంత్రి కొల్లు రవీంద్రకు HIGH COURTలో ఊరట
* ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ముంబై సినీ నటి