News April 19, 2024
గన్నవరం గడ్డపై పాగా వేసేదెవరో..
గన్నవరంలో టీడీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు, సిట్టింగ్ MLA వంశీ వల్లభనేని వైసీపీ నుంచి బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో దిగిన యార్లగడ్డ 838 ఓట్ల తేడాతో ఓడారు. వంశీ వైసీపీలో చేరడంతో యార్లగడ్డ టీడీపీలో చేరి గన్నవరం MLA టికెట్ దక్కించుకుని నేడు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. రానున్న ఎన్నికల సమరంలో గన్నవరంలో వంశీ ఆధిక్యత చాటుకుంటారో, యార్లగడ్డ గెలుపు తీరాలకు చేరుకుంటారో మీ కామెంట్.
Similar News
News September 17, 2024
గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల అభ్యర్థులపై TDP కసరత్తు
కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై అధికార TDP కసరత్తు చేస్తోంది. దేవినేని ఉమా, ఆలపాటి రాజా, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, కోవెలమూడి రవీంద్ర(నాని), కిలారు నాగ శ్రావణ్, ఎంఎస్ బేగ్ పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడిన, యువతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. యూత్ కోటాలో నాగశ్రావణ్ పేరు బలంగా వినిపిస్తోంది.
News September 17, 2024
ఎన్టీఆర్: వినాయక లడ్డు దక్కించుకున్న ముస్లిం దంపతులు
కంచికచర్ల మండలం గొట్టుముక్కలలోని వేణుగోపాల స్వామి ఎదురుగా ఏర్పాటు చేసిన వినాయకుని లడ్డును సోమవారం రాత్రి వేలం వేశారు. అయితే వేలంపాటలో గ్రామానికి చెందిన షేక్ మొగలా సాహెబ్, మమ్మద్ దంపతులు వేలంలో పాల్గొని లడ్డూను రూ.27,116లకు దక్కించుకున్నారు. దీంతో విఘ్నేశ్వరుడు మతాలకు అతీతుడైన దేవుడని వీరు నిరూపించగా.. పలువురు వీరిని అభినందించారు.