News March 25, 2024

గన్నవరం: జాతీయస్థాయి లాక్రోస్ పోటీలకు ఎంపికైన హరికుమార్

image

జాతీయ స్థాయి సీనియర్ లాక్రోస్ పోటీలకు గన్నవరం క్రీడాకారుడు హరికుమార్ ఎంపికైనట్లు ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి నాగరాజు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల29 నుంచి 31వ తేదీ వరకు ఆగ్రాలో జరుగనున్న జాతీయ స్థాయి సీనియర్ లాక్రోస్ పోటీలలో హరి పాల్గొనున్నట్లు చెప్పారు. అనంతరం హరి క్రీడలో ప్రతిభ కనపరిచి బంగారు పతకం సాధించాలని ఆకాంక్షించారు.

Similar News

News December 29, 2024

కృష్ణా: ఎంటెక్ పరీక్షా షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిధిలోని కళాశాలల్లో ఎంటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షలను 2025 జనవరి 22 నుంచి నిర్వహిస్తామని ANU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు 2025 జనవరి 1లోపు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, రివైజ్డ్ షెడ్యూల్ వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడాలని పరీక్షల విభాగం శనివారం పేర్కొంది.

News December 28, 2024

విజయవాడలో రామ్ చరణ్ 256 అడుగుల కటౌట్

image

విజయవాడలో రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 256 అడుగుల ఎత్తుతో గేమ్ ఛేంజర్ కటౌట్ నిర్మించారు. ఈ కటౌట్ ను రేపు మధ్యాహ్నం 3 గంటల సమయంలో గేమ్ చేజింగ్ మూవీ టీం హాజరై ఆవిష్కరించనున్నారు. కటౌట్ ఆవిష్కరణ అనంతరం హెలికాప్టర్‌తో పూల వర్షం కురిపించేందుకు ఏర్పాటు చేసినట్లు సమాచారం. తమ అభిమాన కథానాయకుడు భారీ కటౌట్ ఏర్పాటు చేయటం పట్ల ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News December 28, 2024

విజయవాడ: 1400 మంది యువతకు ఉద్యోగాలు

image

అర్హులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు లభించాయని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. శనివారం విజయవాడలో నిర్వహించిన మెగా వికసిత్ జాబ్ మేళా కార్యక్రమానికి సుమారు 5000 మంది అభ్యర్థులు హాజరయ్యారన్నారు. ఈ జాబ్ మేళాలో 1400 మంది నిరుద్యోగులకు ఐటీ ఉద్యోగాలతో పాటు ఇతర ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు. అనంతరం ఉద్యోగం సాధించిన యువతకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.