News February 13, 2025

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి.. నేడు నిందితుల బెయిల్‌పై తీర్పు

image

టీడీపీ గన్నవరం నియోజకవర్గ కార్యాలయంపై దాడి కేసులో నిందితుల బెయిల్‌పై ఇవాళ తీర్పు వెలువడనుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తాజాగా అరెస్ట్ చేశారు. కేసులో 88 మందిని నిందితులుగా చేర్చగా ఇప్పటికే 45మందిని అరెస్ట్ చేశారు. కాగా ఫిర్యాదుదారుడు సత్యవర్దన్ తనకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని, భయపెట్టి ఫిర్యాదు చేయించారని సోమవారం న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే.

Similar News

News October 27, 2025

కృష్ణా: రిలీఫ్ క్యాంప్‌ల్లో 1,482 మంది

image

మొంథా తుపాన్ తీవ్రత పెరుగుతుండటంతో జిల్లాలోని లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వస్తున్నారు. జిల్లాలో మొత్తం 189 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రానికి 1,482 మంది ఈ కేంద్రాలకు చేరుకున్నారు. మచిలీపట్నం డివిజన్ లోని 92 కేంద్రాల్లో 1,230 మంది, గుడివాడ డివిజన్ లోని 36 కేంద్రాల్లో 82 మంది, ఉయ్యూరు డివిజన్ లోని 61 కేంద్రాల్లో 170 మంది పునరావాసం పొందుతున్నారు.

News October 27, 2025

అన్నమయ్య: నిండు కుండను తలపిస్తున్న 459 చెరువులు

image

అన్నమయ్య జిల్లాలో 3089 చెరువులు ఉండగా 459 చెరువులు తుఫాను ప్రభావంతో పూర్తిస్థాయిలో నిండి, మొరవపోతున్నట్లు ఇరిగేషన్ జిల్లా జేఈ సిద్దేశ్వరి సోమవారం తెలిపారు. అలాగే 75 శాతం మేర నిండిన చెరువులు 508 ఉండగా.. 50 శాతం మేర నిండినవి 676 చెరువులు, 25 శాతం మేర నిండినవి 840 చెరువులు ఉన్నట్లు చెప్పారు. ఇకనిండని చెరువులు 606 ఉన్నట్లు పేర్కొన్నారు. మొంథా తుఫాన్‌తో మరో 75శాతం చెరువులు నిండి మొరవ పోవచ్చన్నారు.

News October 27, 2025

శ్రీకాకుళం: ‘విద్యుత్ సరఫరా అంతరాయానికి ఈ నంబర్లను సంప్రదించండి’

image

మొంథా తుఫాను కారణంగా జిల్లాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని విద్యుత్ శాఖ ఎస్ఈ నాగిరెడ్డి క్రిష్ణమూర్తి తెలిపారు. సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తుఫాను పరిస్థితులను పర్యవేక్షించేందుకు శ్రీకాకుళం, టెక్కలి డివిజన్‌లో 9490610045, 9490610050 హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిమనిన్నారు. విద్యుత్ లైన్లు తెగిపడినా.. స్తంభాలు పడిపోయిన తదితర సమస్యలు ఎదురైతే ఈ నంబర్లను సంప్రదించాలని కోరారు.