News February 13, 2025
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. తీవ్ర ఉత్కంఠ

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విజయవాడ ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు హైదరాబాద్ గచ్చిబౌలిలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వంశీని విజయవాడ తరలిస్తున్నారు. కాగా ఈ కేసులో ఇతర నిందితుల బెయిల్ పిటిషన్లపై కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. దీంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ కేసుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Similar News
News November 23, 2025
భారీ జీతంతో SIDBIలో ఉద్యోగాలు

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(<
News November 23, 2025
రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: జనగామ కలెక్టర్

కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రేపు రద్దు చేస్తున్నట్లు జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాష షేక్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో, అలాగే స్వయం సహాయక సంఘ సభ్యులకు చీరల పంపిణీ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు విధి నిర్వహణలో ఉన్నందున రేపటి గ్రీవెన్స్ సెల్ రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.
News November 23, 2025
‘ది ఫ్యామిలీ మ్యాన్-3’ ఎలా ఉందంటే?

OTTలో ట్రెండింగ్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ నుంచి మూడో సీజన్ విడుదలైంది. ఈశాన్య భారతంలో నడిచే కథతో దర్శకులు రాజ్, డీకే కొత్త ప్రపంచానికి తీసుకెళ్లారు. మనోజ్ బాజ్పాయ్ నటన, విజయ్ సేతుపతి క్యామియో, కొత్త పాత్రల్లో జైదీప్ అహ్లావత్, నిమ్రత్ కౌర్ అదరగొట్టారు. గత సీజన్లతో పోలిస్తే యాక్షన్ తక్కువగా ఉండటం, బలమైన కథ లేకపోవడం నిరాశపరుస్తాయి. చివర్లో సీజన్ 4 ఉందని హింట్ ఇచ్చారు. మీకు ఎలా అనిపించింది?


