News April 17, 2025

గన్నవరం: నేడు వంశీ బెయిల్ పిటిషన్‌లపై విచారణ

image

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో నేడు విచారణ జరగనుంది. మరోవైపు గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వంశీ బెయిల్ పిటీషన్‌పై నేడు విచారణ జరగనుంది. ప్రస్తుతం వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 

Similar News

News April 20, 2025

బంటుమిల్లి : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

image

బంటుమిల్లి మండలం నారాయణపురం సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మచిలీపట్నంకు చెందిన వాసాబత్తిన వీరాచారి (29) ,అనకాపల్లి ప్రసాద్ (28) రాజమండ్రి నుంచి బైక్ పై మచిలీపట్నం వస్తుండగా కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ ఇరువురు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

News April 20, 2025

మచిలీపట్నం: అఘోరిపై ఆడిషన్ ఎస్పీకి ఫిర్యాదు

image

భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ అంబేద్కర్‌ను దుర్భాషలాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన అఘోరి శ్రీనివాసపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని  దళిత సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా సంఘం అధ్యక్షుడు దోవా గోవర్ధన్‌ ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ వివి నాయుడుకు ఫిర్యాదు చేశారు.   

News April 19, 2025

పీఎం పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలి: కలెక్టర్ బాలాజీ

image

అమరావతిలో మే 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర‌మోడీ పర్యటించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. శనివారం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మలతో కలిసి కలెక్టర్ సమీక్షించారు. 

error: Content is protected !!