News February 20, 2025
గన్నవరం: బాలికల మిస్సింగ్.. ఛేదించిన పోలీసులు

గన్నవరం (M) ముస్తాబాద్‌లో నలుగురు బాలికలు అదృశ్యం అయ్యారు. విజయవాడలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్న బాలికలు కాలేజీకి వెళ్లకుండా షాపింగ్ మాల్కి వెళ్లారు. యాజమాన్యం, తల్లిదండ్రులు మందలించడంతో రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో పేరెంట్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నలుగురిని పిడుగురాళ్లలో అదుపులోకి తీసుకున్నట్లు సీఐ శివప్రసాద్ తెలిపారు. దీంతో పేరెంట్స్ కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News October 25, 2025
కృష్ణా: తుపాన్ హెచ్చరికలు.. 3 రోజులు స్కూల్స్ బంద్

‘మోంతా’ తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు శెలవు ప్రకటిస్తున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా విద్యా సంస్థలకు శెలవు ప్రకటిస్తున్నామన్నారు. సంక్షేమ హాస్టల్స్‌లో ఉండే విద్యార్థులందరినీ 26వ తేదీ సాయంత్రం లోపు వారి వారి ఇళ్లకు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు.
News October 25, 2025
జగన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు: కొల్లు రవీంద్ర

రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వంపై బురదజల్లే పనిలో పడ్డారని గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా విమర్శించారు. విజయవాడ ఆర్అండ్బీ అతిథి గృహంలో ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో సమన్వయ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లలో వైసీపీ నేతలు కృష్ణా జిల్లాను అరాచకాల నిలయంగా మార్చారన్నారు.
News October 25, 2025
కృష్ణా: సైకిల్‌పై కలెక్టరేట్‌కు వచ్చిన కలెక్టర్

శబ్ద, వాయు కాలుష్య నియంత్రణలో భాగంగా కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శనివారం కలెక్టరేట్‌కు సైకిల్ పై వచ్చారు. ప్రతి శనివారం కలెక్టరేట్ ఉద్యోగులతో పాటు కలెక్టర్ జిల్లా అధికారులంతా సైకిల్‌పై రావాలని గత వారం ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే శనివారం ఆయన క్యాంప్ ఆఫీస్ నుంచి కలెక్టరేట్‌కు సైకిల్‌పై వచ్చారు. పలువురు కలెక్టరేట్ ఉద్యోగులు సైకిళ్లపై కార్యాలయానికి వచ్చారు.


