News February 10, 2025
గన్నవరం: భార్య డబ్బులు ఇవ్వలేదని.. భర్త ఆత్మహత్య

గన్నవరం మండలంలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. వీరపనేనిగూడానికి చెందిన రానిమేకల వీరబాబు (44) మద్యానికి బానిసై, భార్య డబ్బులివ్వలేదని మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 19, 2025
కృష్ణా: దీపావళి వ్యాపారాలపై వరుణుడి ప్రభావం

ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో జిల్లాలో దీపావళి వ్యాపారాలు పూర్తిగా మందగించాయి. పండుగ ముందు రోజే పూజా సామాగ్రి కొనుగోలు కోసం మార్కెట్కు రావాల్సిన ప్రజలు వర్షం కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. పూలు, పండ్లు, ప్రమిదలు, ఇతర పూజా సామాగ్రి కొనుగోళ్లు లేకపోవడంతో వ్యాపారులు నిరాశకు గురయ్యారు. వర్షం ఆగకపోతే పండుగ రోజు కూడా వ్యాపార నష్టం తప్పదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News October 19, 2025
టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలి: ఎస్పీ

దీపావళి పండుగ సందర్భంగా టపాసులు కాల్చే సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. అధిక శబ్దం కలిగిన బాణాసంచాను కాల్చే సమయంలో తోటి వారికి ఇబ్బంది కలగకుండా కుటుంబ సభ్యులు ముందుగా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఎలాంటి అగ్ని ప్రమాదాలకు తావు లేకుండా పండుగ జరుపుకోవాలని తెలిపారు. బాణాసంచా నిల్వలు కలిగి ఉండడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.
News October 19, 2025
కృష్ణా: కార్తీకమాసానికి ఆలయాలు ముస్తాబు

కార్తీకమాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలోని ఆలయాలు ముస్తాబవుతున్నాయి. హిందువులు నియమనిష్టలతో ఆచరించే ఈ మాసంలో ప్రత్యేక పూజలు, దీపారాధనలకు ఆలయ నిర్వాహకులు సర్వసన్నద్ధమవుతున్నారు. కార్తీకంలో శివాలయాలకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారుల సూచన.