News December 19, 2024
గన్నవరం మండలంలో వలకు చిక్కిన చిరుత.. మృతి
గన్నవరం మండలం మెట్లపల్లిలో చిరుతపులుల సంచారంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామానికి చెందిన రైతు పందుల నుంచి తన పంట పొలాన్ని రక్షించేందుకు ఉచ్చు పెట్టగా ఉచ్చులో చిరుత పులి చిక్కింది. రైతు ఉదయాన్నే పొలం వెళ్లి చూడగా ఉచ్చులో చిక్కి చిరుత పులి మృతి చెందింది. దీంతో గ్రామస్థులు, పరిసర ప్రాంత ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 14, 2025
కృష్ణా: కోజాకు బలే గిరాకీ రూ.3వేలు
కోడి పందేల బరుల వద్ద పోరాడి ఓడిన పుంజు మాంసంపై డిమాండ్ అమాంతం పెరిగింది. కోజాగా వ్యవహరించే ఈ కోడిని ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలుచోట్ల కొనుగోలుదారులు రూ.2 నుంచి రూ.3వేలు పెట్టి కొన్నారు. ఇదే అదనుగా భావించిన స్వార్థపరులు పెరటి కోడి పుంజులను తక్కువకు కొనుగోలు చేసి బ్లేడ్లతో గాట్లు పెట్టి కాల్చి అధిక ధరలకు అమ్మకాలు జరిపారు.
News January 14, 2025
కంకిపాడులో కోడిపందేల శిబిరం వద్ద ఘర్షణ
కంకిపాడు కోడిపందేం శిబిరం వద్ద సోమవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. వణుకూరు-పునాదిపాడు యువకులు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. బీర్ సీసాలతో వీరంగం సృష్టించారు. ఓ వ్యక్తి తల పగిలింది. స్థానికులు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. మరో వ్యక్తి కంకిపాడు పోలీస్ స్టేషన్లో దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేశారు. కాగా పోలీసులు కోడిపందేల శిబిరానికి పర్మిషన్ ఇవ్వడంపై ప్రజలు మండిపడుతున్నారు.
News January 14, 2025
మండవల్లిలో రాష్ట్రస్థాయి పొటేళ్ల పందేలు
మండవల్లి మండలం చావలిపాడులో సంక్రాంతి సందర్భంగా సోమవారం రాష్ట్ర స్థాయిలో పోటేళ్ల పందేలు నిర్వహించారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల పోటేళ్ల పందేలు నిర్వహించగా ఈ పోటీల్లో 3 రాష్ట్రాల నుంచి సుమారు 100 నుంచి 120 పొటేళ్లు పాల్గొన్నాయి. గ్రామంలో తొలిసారి 3 రాష్ట్రాల పోటేళ్ల పందేలు నిర్వహిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పోటీలను తిలకించారు.