News April 5, 2025
గన్నవరం: మహిళల్ని రక్షించబోయి మేస్త్రీ మృతి

గన్నవరం మండలం మాదలవారిగూడెంలో స్లాబ్ పనిలో విషాదం చోటుచేసుకుంది. ఆగిరిపల్లి చెందిన కాంక్రీట్ మేస్త్రీ పిల్లిబోయిన కొండలు (35) కూలీలతో కలిసి స్లాబ్ వేస్తున్నారు. ఆ సమయంలో సిమెంట్ తీసుకెళ్లె లిప్ట్ ఒక్కసారిగా తెగి కింద పడింది. అక్కడే మహిళల్ని తప్పించబోయి ఏడుకొండలు లిఫ్ట్ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 6, 2025
కృష్ణా: నదిలో ముగ్గురు గల్లంతు, ఒకరి మృతి

అవనిగడ్డలో పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది. ఆదివారం అవనిగడ్డ (మ) మోదుమూడి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు అవనిగడ్డ శివారు కొత్తపేట వద్ద కృష్ణానదిలో ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. స్థానికులు గమనించి సహాయక చర్యలు చేపట్టే లోపే ముగ్గురిలో వెంకట గోపి కిరణ్ మరణించాడు. మరో ఇద్దరి కోసం డీఎస్పీ విద్యశ్రీ, సీఐ యువ కుమార్, ఎస్ఐ శ్రీనివాస్, సిబ్బంది గాలిస్తున్నారు.
News April 6, 2025
పెనమలూరు: కలకలం రేపిన మహిళ అనుమానాస్పద మృతి

యనమలకుదురు లంకలలో ఓ మహిళ మృతదేహం కనపడటం కలకలం రేపింది. శనివారం ఉదయం ముళ్లకంపల్లో గులాబీ చీర, జాకెట్‌లో ఆమె శవమై కనిపించింది. కళ్లు, ముక్కు, నోటి నుంచి రక్తస్రావం, మోచేతికి పచ్చబొట్టు ఉండటంతో అనుమానాలు పెరిగాయి. పోలీసులు కేసు నమోదు చేసి డాగ్ స్క్వాడ్‌తో విచారణ ప్రారంభించారు. ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడ్డారా అనే అనుమానాలు వస్తున్నాయి.
News April 6, 2025
కృష్ణా జిల్లాలో తగ్గిన చికెన్ ధరలు.!

కృష్ణా జిల్లాలో చికెన్ ధరలు గత వారంతో పోల్చుకుంటే కొంతమేర తగ్గాయి. ఆదివారం జిల్లాలోని గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో గత వారంలో కేజీ చికెన్ రూ.260లు ఉండగా, నేడు రూ.230కి తగ్గింది. పెద్దబాయిలేర్ రూ.230, చిన్న బాయిలర్ స్కిన్ లెస్ రూ.230, విత్ స్కిన్ రూ.220గా ఉన్నాయి. ధరలు తగ్గిన నేపథ్యంలో మాంసం దుకాణాల వద్ద కొనుగోలుదారుల సందడి నెలకొంది. మీ ఊరిలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో.. COMMENT చేయండి.