News April 5, 2025

గన్నవరం: మహిళల్ని రక్షించబోయి మేస్త్రీ మృతి

image

గన్నవరం మండలం మాదలవారిగూడెంలో స్లాబ్ పనిలో విషాదం చోటుచేసుకుంది. ఆగిరిపల్లి చెందిన కాంక్రీట్ మేస్త్రీ పిల్లిబోయిన కొండలు (35) కూలీలతో కలిసి స్లాబ్ వేస్తున్నారు. ఆ సమయంలో సిమెంట్ తీసుకెళ్లె లిప్ట్ ఒక్కసారిగా తెగి కింద పడింది. అక్కడే మహిళల్ని తప్పించబోయి ఏడుకొండలు లిఫ్ట్ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 17, 2025

ధర్మపురి: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

image

ధర్మపురి పట్టణంలోని కస్తూర్బా పాఠశాలను శుక్రవారం కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. పాఠశాల ఆవరణలో గల ఖాళీ స్థలంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ, డీఈఓ, తహశీల్దార్ తదితరులున్నారు.

News October 17, 2025

జనగామ: వ్యవసాయ మార్కెట్‌కు ఐదు రోజులు సెలవులు

image

జనగామ వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 19 నుంచి 23 వరకు సెలవులు ఉంటాయని మార్కెట్ కమిటీ ఛైర్మన్ భానుక శివరాజ్ యాదవ్ తెలిపారు. దీపావళి ఆనవాయితీ ప్రకారం ఈనెల 22, 23వ తేదీల్లో కేదారేశ్వర వ్రతాల సెలవులు కాగా.. 19న సాధారణ సెలవు, 20న దీపావళి, 21న అమావాస్య సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. తిరిగి 24న మార్కెట్ పునః ప్రారంభం అవుతుందన్నారు.

News October 17, 2025

గన్నేరువరం: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

image

ప్రజలకు పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా సివిల్‌ సప్లై అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. అక్రమంగా రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు మండలంలోని గుండ్లపల్లి ఎక్స్ రోడ్డు వద్ద సివిల్‌ సప్లై అధికారుల పట్టుకున్నట్లు ఎస్సై వివరించారు. బొలెరోలో 50 క్వింటాళ్ల రేషన్ బియ్యం లభ్యమయ్యాయి. సివిల్ సప్లై అధికారి ఫిర్యాదు మేరకు బొజ్జ రాజు పైన కేసు నమోదు చేశారు.