News March 10, 2025
గన్నవరం: వంశీ కస్టడీపై నేడు విచారణ

విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టులో నేడు వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్‌పై విచారణ జరుగనుంది. పోలీసులు వంశీని 10రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తులో మరిన్ని వివరాలు సేకరించేందుకు కస్టడీ అవసరమని పోలీసులు కోర్టుకు వివరించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వంశీ ఏ71గా ఉన్నారు.
Similar News
News March 21, 2025
మచిలీపట్నం: సీఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్

దేశ శాంతిభద్రతలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) ప్రముఖ పాత్ర పోషిస్తోందని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. సీఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీ గురువారం సాయంత్రం మచిలీపట్నం చేరుకోగా శుక్రవారం ఉదయం జడ్పీ కన్వెన్షన్ నుంచి ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. జిల్లా అడిషనల్ ఎస్పీ సత్యనారాయణతో కలిసి కొంతదూరం సైకిల్ ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు.
News March 21, 2025
గన్నవరం: వంశీ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌ను కోర్టు వాయిదా వేసింది. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు విచారణను మార్చి 26కు వాయిదా వేసింది. కోర్టు దర్యాప్తు అధికారిణి హాజరుకావాలని ఆదేశించింది. తదుపరి విచారణలో అధికారిపై వివరాలు కోరనుంది.
News March 21, 2025
సీఐఎస్ఎఫ్ చూపుతున్న దేశభక్తి ప్రశంసనీయం: కలెక్టర్

ర్యాలీలో పాల్గొన్న సీఐఎస్ఎఫ్ సిబ్బందిని కలెక్టర్ డీకే బాలాజీ అభినందిస్తూ వారు చూపుతున్న దేశభక్తి, అంకితభావం ప్రశంసనీయమన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సీఐఎస్ఎఫ్ దేశం నలుమూలల అంతర్గత పరిరక్షణలో ప్రముఖ పాత్ర పోషిస్తోందన్నారు. ప్రజల సహకారంతోనే ప్రభుత్వం ముందడుగు వేయడానికి వీలుందన్నారు. ప్రజలను భాగస్వామ్యులుగా చేయాలనే ఉద్దేశంతో సీఐఎస్ఎఫ్ బృహత్తర కార్యక్రమం చేపట్టిందన్నారు.