News March 13, 2025

గన్నవరం: వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ

image

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్‌లో ఉన్న వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో గురువారం మరోసారి విచారణ జరగనుంది. గతంలో వంశీకి బెయిల్ నిరాకరించగా, తాజా పిటిషన్‌పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ఈ 71గా వంశీ ఉన్నారు. ఇటీవల నియోజకవర్గంలో పలు కేసులు ఆయనపై నమోదయ్యాయి.

Similar News

News March 14, 2025

MBNR: ఘనంగా కామ దహన వేడుకలు (PHOTO)

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి కామ దహన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కామ దహనం తర్వాతి రోజు ప్రజలు హోలీ పండుగను నిర్వహించుకోనున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి గ్రామంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా హోలీ సంబరాలు ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగను జరుపుకోనున్నారు.>>HAPPY HOLI

News March 14, 2025

కృష్ణా: హోలీ సందర్భంగా ఎస్పీ హెచ్చరిక

image

ఎస్పీ ఆర్. గంగాధరరావు ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఆహ్లాదకర వాతావరణంలో పండుగ జరుపుకోవాలన్నారు. హోలీని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ప్రజా జీవనానికి అంతరాయం కలిగించినా, బహిరంగ ప్రదేశాలలో రంగులు చల్లి ఇతరులకు ఇబ్బంది కలిగించినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

News March 14, 2025

పార్వతీపురం జిల్లాలో వారి కోసం ‘ఊయల’

image

పార్వతీపురం మన్యం జిల్లాలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తల్లిదండ్రుల ఆలనకు నోచుకోని పిల్లల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పీడీ కనకదుర్గ తెలిపారు. ఊయల పేరుతో ఏర్పాటు చేసిన కేంద్రాలను గురువారం ప్రారంభించారు. పిల్లలను పెంచలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులు వారిని ఊయల కేంద్రంలో అప్పగించాలని సూచించారు.

error: Content is protected !!