News March 13, 2025
గన్నవరం: వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్‌లో ఉన్న వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో గురువారం మరోసారి విచారణ జరగనుంది. గతంలో వంశీకి బెయిల్ నిరాకరించగా, తాజా పిటిషన్‌పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ఈ 71గా వంశీ ఉన్నారు. ఇటీవల నియోజకవర్గంలో పలు కేసులు ఆయనపై నమోదయ్యాయి.
Similar News
News February 9, 2026
హుస్నాబాద్ : పొలంలో కుప్పకూలి యువ రైతు మృతి

హుస్నాబాద్ మండల పరిధిలోని అరపల్లెలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొర్ల అజయ్ యాదవ్ అనే యువ రైతు ఆదివారం పొలం వద్ద ప్రమాదవశాత్తు మరణించారు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండగా అకస్మాత్తుగా మూర్ఛ రావడంతో ఆయన పొలంలోనే పడిపోయి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి.
News February 9, 2026
గోత్రాలు ఎలా ఏర్పడతాయో తెలుసా?

గోత్రం అంటే మూల పురుషుడి నుంచి ఉద్భవించిన వంశం అని అర్థం. సంస్కృతంలో ‘గో’ అంటే వేదం, భూమి, ఆవు అనే అర్థాలున్నాయి. పూర్వం వశిష్ట, భరద్వాజ వంటి సప్తర్షుల పేర్ల మీద ఈ గోత్రాలు ఏర్పడ్డాయి. తమ వంశం ఏ గురువు లేదా మహర్షి ఆధ్యాత్మిక పరంపర నుంచి వచ్చిందో ఇది తెలియజేస్తుంది. కాలక్రమేణా ప్రముఖ వ్యక్తులు, పూర్వీకుల పేర్లతో కూడా గోత్రాలు వెలిశాయి. ఇది మన మూలాలను, వంశ గౌరవాన్ని గుర్తుచేసే ఓ పవిత్ర గుర్తింపు.
News February 9, 2026
వరిలో సల్ఫైడ్ దుష్ప్రభావం – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వరి పొలంలో ఉన్న మురుగు నీటిని బయటకు పంపి మళ్లీ కొత్త నీటిని పెట్టాలి. అమ్మోనియం సల్ఫేట్ వంటి ఎరువులను ఇలాంటి పొలాల్లో వాడకూడదు. 10 కేజీల స్వర్ణపాల్ సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని 100 కేజీల వర్మికంపోస్ట్‌లో కలిపి ఎకరం పొలంలో చల్లుకోవాలి. లీటర్ నీటికి నీటిలో కరిగే స్థూల పోషకాలు (19.19.19) 10 గ్రాములను, 3 నుంచి 5 గ్రాముల సూక్ష్మపోషకాలను లీటర్ నీటికి కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.


