News December 17, 2024
గన్నవరం విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతి
ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేరుకున్నారు. రాష్ట్రపతికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గౌరవ వందనం స్వీకరించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన మంగళగిరిలోని ఎయిమ్స్‌కు బయలుదేరి వెళ్లారు.
Similar News
News January 14, 2025
కృష్ణా: కోజాకు బలే గిరాకీ రూ.3వేలు
కోడి పందేల బరుల వద్ద పోరాడి ఓడిన పుంజు మాంసంపై డిమాండ్ అమాంతం పెరిగింది. కోజాగా వ్యవహరించే ఈ కోడిని ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలుచోట్ల కొనుగోలుదారులు రూ.2 నుంచి రూ.3వేలు పెట్టి కొన్నారు. ఇదే అదనుగా భావించిన స్వార్థపరులు పెరటి కోడి పుంజులను తక్కువకు కొనుగోలు చేసి బ్లేడ్లతో గాట్లు పెట్టి కాల్చి అధిక ధరలకు అమ్మకాలు జరిపారు.
News January 14, 2025
కంకిపాడులో కోడిపందేల శిబిరం వద్ద ఘర్షణ
కంకిపాడు కోడిపందేం శిబిరం వద్ద సోమవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. వణుకూరు-పునాదిపాడు యువకులు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. బీర్ సీసాలతో వీరంగం సృష్టించారు. ఓ వ్యక్తి తల పగిలింది. స్థానికులు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. మరో వ్యక్తి కంకిపాడు పోలీస్ స్టేషన్లో దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేశారు. కాగా పోలీసులు కోడిపందేల శిబిరానికి పర్మిషన్ ఇవ్వడంపై ప్రజలు మండిపడుతున్నారు.
News January 14, 2025
మండవల్లిలో రాష్ట్రస్థాయి పొటేళ్ల పందేలు
మండవల్లి మండలం చావలిపాడులో సంక్రాంతి సందర్భంగా సోమవారం రాష్ట్ర స్థాయిలో పోటేళ్ల పందేలు నిర్వహించారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల పోటేళ్ల పందేలు నిర్వహించగా ఈ పోటీల్లో 3 రాష్ట్రాల నుంచి సుమారు 100 నుంచి 120 పొటేళ్లు పాల్గొన్నాయి. గ్రామంలో తొలిసారి 3 రాష్ట్రాల పోటేళ్ల పందేలు నిర్వహిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పోటీలను తిలకించారు.