News April 5, 2025
గన్నవరం విమానాశ్రయం చేరుకున్న “జాక్” మూవీ టీమ్

సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ “జాక్” ప్రమోషన్స్ కోసం చిత్రబృందం శనివారం విజయవాడ విచ్చేశారు. కొద్దిసేపటి క్రితం మూవీ టీమ్‌తో పాటు సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈనెల 10న విడుదల కానున్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.
Similar News
News November 23, 2025
సత్యసాయి సిద్ధాంతాలు ఇవే: చంద్రబాబు

AP: 102 సత్యసాయి స్కూళ్లలో 60వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు. ‘సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింస సిద్ధాంతాలుగా సత్యసాయిబాబా నూతన అధ్యాయం ప్రారంభించారు. తన మహిమలతో అన్ని మతాలు ఒక్కటేనని భక్తులకు ప్రత్యక్షంగా నిరూపించారు. దేశవిదేశాల నుంచి దేశాధినేతలు వచ్చి సత్యసాయిబాబాను దర్శించుకున్నారు. ఆయన ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలి’ అని పుట్టపర్తిలో తెలిపారు.
News November 23, 2025
సిరిసిల్ల: సాయిరాం ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త: ఎస్పీ

పుట్టపర్తి సాయిరాం ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త అని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బీ గీతే అన్నారు. సాయిరాం జయంతి సందర్భంగా సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పుట్టపర్తి సాయిరాం పేద ప్రజలకు ఉచితంగా ఆపరేషన్లు, ఎన్నో సేవలు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
News November 23, 2025
నిర్మల్: పర్యటన రూట్ కాదు.. రిస్క్ రూట్

గడిచిన పది నెలల్లో జిల్లాలో 522 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు పోలీసు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 139 మంది ప్రాణాలు కోల్పోగా.. 612 మంది క్షతగాత్రులు గాయపడ్డారు. ప్రధానంగా నిర్మల్-భైంసా, బాసర-భైంసా, నిర్మల్-ఖానాపూర్ మార్గాల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాహనాలను నెమ్మదిగా, జాగ్రత్తగా నడపాలని ఎస్పీ జానకి షర్మిలా సూచించారు.


