News November 20, 2024
గన్నవరం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
గన్నవరం మండలంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పిన్నమనేని సిద్ధార్థ హాస్పిటల్ వద్ద రోడ్డు ప్రమాదం జరగడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఆగి ఉన్న లారీని ఓ బైక్ ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం తెలుసుకున్న గన్నవరం సీఐ శివప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
Similar News
News December 10, 2024
తిరువూరు నుంచి Dy.CM పవన్‌కు బెదిరింపు కాల్స్
Dy.CM పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తి తిరువూరుకు చెందిన మల్లికార్జున రావుగా పోలీసులు గుర్తించారు. ఇతను పవన్ ఓఎస్డీకి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడినట్లు ఫిర్యాదులు అందగా..పోలీసులు రంగంలోకి దిగారు. ఎంజీ రోడ్డు నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు గుర్తించారు. అయితే ఆ ఏరియాలో ఆరా తీయగా అతని జాడలేదు.అతనే ఫోన్ చేశాడా.. ఎవరైనా అతని పేరుపై సిమ్ తీసుకున్నారా అని తెలియాల్సి ఉంది.
News December 10, 2024
జగన్ వెంటే ఉంటా: MLC
తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని విజయవాడకు చెందిన ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ‘నిబంధనలు మేరకు నాకు రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డులో సభ్యునిగా అవకాశం ఇచ్చింది. రాజకీయాల్లో ఉన్నంత వరకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటా. నన్ను రాజకీయాల్లో ప్రోత్సహించిన ఏకైక వ్యక్తి జగన్’ అని ఆయన చెప్పారు.
News December 10, 2024
కృష్ణా: లా కోర్సు పరీక్షా ఫలితాలు విడుదల
కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలోని కళాశాలల్లో సెప్టెంబర్-2024లో నిర్వహించిన పలు లా కోర్సుల పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ మేరకు LLB, BA.LLB 2వ సెమిస్టర్ పరీక్ష L BA. LLB 6వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల చేసినట్లు KRU పరీక్షల విభాగం తెలిపింది. విద్యార్థులు ఫలితాలకై https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.