News February 11, 2025

గన్నవరం TDP ఆఫీస్‌పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్..

image

గన్నవరం TDP ఆఫీసుపై దాడి కేసులో ఫిర్యాదుదారుడైన సత్యవర్థన్ ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని న్యాయాధికారికి సోమవారం వాంగ్మూలం అందజేశారు. వైసీపీ హయాంలో TDP ఆఫీసుపై ఈ దాడి జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక TDP ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న సత్యవర్థన్ ఫిర్యాదుతో పోలీసులు కేసు పెట్టారు. అయితే దాడి సమయంలో తాను అక్కడ లేనని, TDP నేతలు బలవంతంగా కేసు పెట్టించారని అతను ఆరోపించాడు.

Similar News

News March 21, 2025

మచిలీపట్నం: చింత చెట్టు సెంటర్లో దారుణ హత్య

image

మచిలీపట్నం చింత చెట్టు సెంటర్లో దారుణ హత్య ఘటన చోటు చేసుకుంది. మృతుడు అదే ప్రాంతానికి చెందిన విర్నాల శ్రీను అలియాస్ టోపీ శ్రీనుగా గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు శ్రీను నివాసంలోకి చొరబడి విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఆయన ఘటన స్థలిలోనే మృతిచెందారు. పోలీసులు హత్యాస్థలానికి చేరుకొని మచిలీపట్నం డీఎస్పీ ఆధ్వర్యంలో కేసు నమోదు చేశారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News March 21, 2025

కృష్ణా: ‘రెడ్ బుక్‌తో ఏం చేయలేరు’ 

image

వైసీపీ నేతల అరెస్ట్‌లతో జగన్ పరపతి ఎక్కడా తగ్గదని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో ఏం చేయలేరని, 6 గ్యారంటీల అమల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పోసానిపై 18 కేసులు పెట్టేందుకు ఆధారాలు ఏమున్నాయని ప్రశ్నించారు. అరెస్ట్‌లతో కూటమి నాయకులు మానసిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. 

News March 21, 2025

కృష్ణా: పదవ తరగతి ఇంగ్లిష్ పరీక్షకు 98.70% హాజరు 

image

10వ తరగతి పరీక్షల్లో భాగంగా మూడవ రోజైన శుక్రవారం నిర్వహించిన ఇంగ్లిష్ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. 21,114 మంది విద్యార్థులకు గాను 20,840 మంది విద్యార్థులు హాజరయ్యారు. హాజరు శాతం 98.70% నమోదైంది. 33 పరీక్షా కేంద్రాలను స్క్వాడ్ అధికారులు తనిఖీ చేయగా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదని డీఈఓ రామారావు తెలిపారు. 

error: Content is protected !!