News February 19, 2025

గన్‌ఫౌండ్రీ: ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలను పరిష్కరించాలి

image

తెలంగాణలో ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎన్జీఓస్‌ అధ్యక్షుడు ఎం.జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్‌ హుస్సేన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం టీఎన్జీఓస్‌ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగుల హెల్త్‌కార్డ్స్, పీఆర్సీ, పెండింగ్‌ డీఏ సమస్యలు పరిష్కరించాలన్నారు.

Similar News

News November 26, 2025

BIG BREAKING: HYDలో బోర్డు తిప్పేసిన IT కంపెనీ

image

హైదరాబాద్‌లో మరో ఐటీ కంపెనీ ఘరానా మోసం బయటపడింది. మాదాపూర్‌లోని NSN ఇన్ఫోటెక్‌లో శిక్షణ–ఉద్యోగం పేరుతో రూ. లక్షల్లో వసూలు చేశారు. 400 మందిలో ఒక్కొక్కరి నుంచి రూ.2 నుంచి 3 లక్షల వరకు వసూళ్లు చేసి, చివరకు బోర్డు తిప్పేసినట్లు బాధితులు వాపోయారు. కంపెనీ నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. బాధితులు మాదాపూర్ PS, సైబరాబాద్ EOWలో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News November 26, 2025

నగరం.. మహానగరం.. విశ్వనగరం

image

అప్పట్లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.. తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.. ఇదీ సిటీ పరిస్థితి. ఇక ఔటర్ చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు గ్రేటర్లో కలిసిన తర్వాత విశ్వనగరంగా మారనుంది. జనాభా కూడా భారీగానే పెరిగే అవకాశముంది. ప్రస్తుతం గ్రేటర్ జనాభా 1.40 కోట్లు ఉండగా విలీనం తర్వాత 1.70 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది.

News November 26, 2025

రేపు BRS హైదరాబాద్ కీలక సమావేశం

image

BRS హైదరాబాద్ జిల్లా కీలక సమావేశం రేపు (గురువారం) జరుగనుంది. సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగే ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR హాజరుకానున్నారని తలసాని తెలిపారు. ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివస్ వేడుకల గురించి సమావేశంలో చర్చించనున్నారు.