News September 30, 2024

గన్‌మెన్లను వెనక్కు పంపిన అనంతపురం MLA?

image

అనంతపురం MLA దగ్గుపాటి ప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన గన్‌మెన్లను వెనక్కు పంపారు. రాప్తాడు వైసీపీ నేత మహానందరెడ్డికి ప్రభుత్వం గన్‌మెన్లను కేటాయించడంతో నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహానందరెడ్డి గతంలో ముగ్గురి హత్య కేసులో నిందితుడు. దీంతో సంఘ విద్రోహ వ్యక్తులు, జిల్లా బహిష్కరణ చేయాల్సిన వ్యక్తులకు గన్‌మెన్‌లను ఎలా కేటాయిస్తారంటూ ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

Similar News

News December 6, 2025

అనంతపురంలో రెజ్లింగ్ విజేత శ్రీ హర్షకు సన్మానం

image

ఇటీవల రెజ్లింగ్ పోటీలలో బంగారు పతకం సాధించిన శ్రీహర్షను అనంతపురంలో ఏపీ స్టూడెంట్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు అమర్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. నార్పల మండలానికి చెందిన బాల శ్రీహర్ష బంగారు పతకం సాధించడం జిల్లాకు గర్వకారణం అన్నారు. గుజరాత్‌లో నిర్వహించే అంతర్జాతీయ రెజ్లింగ్ పోటీలకు హర్ష ఎంపికయ్యారని తెలిపారు. అందులో కూడా రాణించాలని ఆకాంక్షించారు.

News December 6, 2025

చంద్రబాబూ.. గంగిరెద్దులా తలూపొద్దు: అనంత వెంకటరామిరెడ్డి

image

రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కేంద్రంతో పోరాడాల్సిన చంద్రబాబు.. రైతులను పణంగా పెట్టి తన పాత కేసులను మాఫీ చేసుకుంటున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉందంటే అది ఇక్కడి ఎంపీల వల్లేనని గుర్తు చేశారు. ఒక్క వార్నింగ్‌ ఇస్తే కేంద్రం దిగి వస్తుందని, కానీ చంద్రబాబు మాత్రం తన స్వప్రయోజనాల కోసం కేంద్రం వద్ద గంగిరెద్దులా తలూపుతున్నారని మండిపడ్డారు.

News December 6, 2025

580 మార్కులు సాధిస్తే విమాన విహారం: ఎమ్మెల్యే సురేంద్రబాబు

image

పదో తరగతిలో 580 మార్కులు సాధించిన విద్యార్థులను మంత్రి నారా లోకేశ్ వద్దకు తీసుకువెళ్లి విమాన విహారానికి అవకాశం కల్పిస్తామని ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు. కళ్యాణదుర్గం మోడల్ స్కూల్లో శుక్రవారం ఏర్పాటుచేసిన మెగా టీచర్స్, పేరెంట్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.