News February 3, 2025

గన్ మెన్ నాగరాజుకు అభినందించిన బాపట్ల కలెక్టర్

image

బాపట్ల జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో ప్రతిభ కనబరిచిన గన్ మెన్ నాగరాజును జిల్లా కలెక్టర్ వెంకట మురళి అభినందించారు. జిల్లా పోలీస్ గ్రౌండ్‌లో జరిగిన జిల్లా స్పోర్ట్స్ మీట్‌ అథ్లెటిక్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నాగరాజును సోమవారం జిల్లా కలెక్టర్ వెంకట మురళి అభినందించారు. కాగా నాగరాజు 4 బంగారు పతకాలు, ఒక సిల్వర్ పతకాన్ని గెలుపొందారు.

Similar News

News February 16, 2025

‘డాకు మహారాజ్’ ఓటీటీలోకి ఎప్పుడంటే?

image

బాలకృష్ణ, బాబీ కాంబినేషన్లో తెరకెక్కిన డాకు మహారాజ్ మూవీ ఈ నెల 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఇండియా సౌత్ Xలో వెల్లడించింది. ‘అనగనగా ఒక రాజు.. చెడ్డవాళ్లు అందరూ డాకు అనేవాళ్లు.. కానీ మాకు మాత్రం మహారాజు’ అని రాసుకొచ్చింది. గత నెల 12న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రూ.170 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.

News February 16, 2025

తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేసిన అనకాపల్లి ఎంపీ

image

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట ఘటనపై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆదివారం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో ప్రాణ నష్టం జరగడం అత్యంత బాధాకరంగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ రూ.పది లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించిందని అన్నారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.

News February 16, 2025

సిరిసిల్ల: ఈ నెల 18 నుంచి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం

image

బీసీ స్టడీ సర్కిల్‌లో RRB, SSC, BANKING ఉచిత శిక్షణ తరగతులు ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతాయని సిరిసిల్ల బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకట స్వామి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల కోరిక మేరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని సూచించారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించి 18న ఉదయం 10 గంటలకు క్లాసులకు హాజరు కావాలని కోరారు.

error: Content is protected !!