News March 12, 2025
గరిడేపల్లి మండల వాసికి గ్రూప్-1 జాబ్

గరిడేపల్లి మండల పరిధిలోని చిన్నగారకుంట తండాకి చెందిన భూక్యా సందీప్ గ్రూప్-1 ఫలితాల్లో 468.5 మార్కులు సాధించారు. ఇదివరకే ఎస్జీటీగా ఉద్యోగం సాధించి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం గుండెపురిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నారు. గతంలో వరుసగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. దీంతో వారి ఎంపిక పట్ల మండల వాసులు అభినందనలు తెలుపుతున్నారు.
Similar News
News November 3, 2025
రాయచోటిలో నేడు స్పందన కార్యక్రమం

అన్నమయ్య జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం రాయచోటిలో స్పందన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను కలెక్టరేట్‌కి రాకుండా meekosam.ap.gov.inలో కూడా నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. అర్జీ స్థితి సమాచారం కోసం 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చన్నారు. గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో పరిష్కారం కాని అర్జీలుదారులు మాత్రమే కలెక్టరేట్‌కు రావాలని సూచించారు.
News November 3, 2025
మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా సోము వీర్రాజు

బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా అధిష్ఠానం ఆయనను నియమించింది. ఎమ్మెల్యే కోటా ద్వారా మండలిలోకి వచ్చిన వీర్రాజు ఇకపై పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. ఇప్పటివరకు ఫ్లోర్ లీడర్ లేకపోవడంతో, ఆయన సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని ఈ కీలకపదవిని కేటాయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
News November 3, 2025
శుభ కార్యాలప్పుడు గుమ్మానికి మామిడి తోరణాలు ఎందుకు కడతారు?

హిందూ ఆచారాల ప్రకారం.. శుభకార్యాల వేళ ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కడుతుంటారు. అయితే ఇది అలంకరణలో భాగమే కాదు. దీని వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయంటున్నారు పండితులు. ‘పండుగలు, శుభ కార్యాల వేళ ఇంటికి ఎక్కువ మంది వస్తుంటారు. వారి వల్ల కలుషితమైన గాలిని మామిడి ఆకులు శుద్ధి చేస్తాయి. ఈ ఆకుల నుంచి వచ్చే గాలిని పీల్చడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మామిడి చెట్టు కల్పవృక్షం’ అని అంటున్నారు.


