News March 12, 2025
గరిడేపల్లి మండల వాసికి గ్రూప్-1 జాబ్

గరిడేపల్లి మండల పరిధిలోని చిన్నగారకుంట తండాకి చెందిన భూక్యా సందీప్ గ్రూప్-1 ఫలితాల్లో 468.5 మార్కులు సాధించారు. ఇదివరకే ఎస్‌జీటీగా ఉద్యోగం సాధించి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం గుండెపురిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నారు. గతంలో వరుసగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. దీంతో వారి ఎంపిక పట్ల మండల వాసులు అభినందనలు తెలుపుతున్నారు.
Similar News
News February 11, 2026
ఎన్నికల దృష్ట్యా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తాం: వనపర్తి ఎస్పీ

వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎన్నికల సరళికి ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎలక్షన్ సెల్ ద్వారా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తామని ఎస్పీ సునీత రెడ్డి పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జిల్లా వ్యాప్తంగా 1,000 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పూర్తి రక్షణతో పాటు 163 BNSS (144 సెక్షన్)ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు SP స్పష్టం చేశారు.
News February 11, 2026
మున్సి‘పోల్’కు వేళాయే!

TG: మున్సిపోల్‌కు అంతా సిద్ధమైంది. రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పోరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఇవాళ ఉ.7 గంటల నుంచి సా. 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 2,981 వార్డులకు 12,944 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటవ్వగా 52 లక్షల మందికి పైగా ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్లు ఓటర్/ఆధార్/పాన్/డ్రైవింగ్ వంటి గుర్తింపు కార్డులు వెంట తీసుకెళ్లాలని అధికారులు సూచించారు.
News February 11, 2026
జగమంతా శివతత్వం

శివతత్వం అంటే కేవలం ఒక రూపం మాత్రమే కాదు. అది అంతటా నిండి ఉన్న అనంతమైన చైతన్యం. సృష్టిలోని ప్రతి అణువులోనూ, ప్రకృతిలోని ప్రతి మార్పులోనూ శివుడు ఉన్నాడు. కనిపించే పర్వతాలు, ఆకాశం నుంచి మనలో కలిగే ఆలోచనలు, కలల వరకు అన్నీ ఆ శివమయమే. శివం కానిది ఈ విశ్వంలో ఏదీ లేదు. మన ఊహకు అందేదీ ఆయనే! ఆ ఊహ చేసేదీ ఆయనే! శివతత్వం అంటే మౌనం, శూన్యం, సమస్తం. జగమంతా శివతత్వమే.


