News February 22, 2025
గరివిడి: గుండెపోటుతో కుప్పకూలిన ఉపాధ్యాయుడు

గరివిడి మండలంలోని కొండదాడి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రామారావు(50) గుండెపోటుతో శుక్రవారం మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం పాఠశాలలో ప్రార్థన ముగిసిన తరువాత అసౌకర్యంగా ఉండడంతో రామారావు బాత్ రూమ్ కు వెళ్లారు. ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో అక్కడే కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News March 21, 2025
మన సంస్కృతి, సాంప్రదాయంలోనే వృక్ష సంరక్షణ ఉంది: మంత్రి

ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా కేబీఆర్ పార్కులో జరిగిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. మన సంస్కృతి, సాంప్రదాయంలోనే వృక్ష సంరక్షణ ఉందని, వృక్షో రక్షతి రక్షితః చెట్టును మనం కాపాడితే.. చెట్టు మనల్ని కాపాడుతుందని, ఇది జగమెరిగిన సత్యమని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, జీవజాలం మనుగడకు అడవులే ఆధారమని, జీవజాలానికి, వనాలకు విడదీయరాని సంబంధం ఉందని తన అభిప్రాయమన్నారు.
News March 21, 2025
మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని వడ్డించాలని కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. శుక్రవారం భూత్పూర్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు అందించే భోజనాన్ని ఆమె పరిశీలించారు. కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె పలు సూచనలు చేశారు.
News March 21, 2025
మహబూబ్‌నగర్: ప్రశాంతంగా పదో తరగతి మొదటి రోజు పరీక్ష

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్లను రూమ్ నెంబర్ వైస్‌గా చెక్ చేసుకుని వెళ్లారు. పరీక్ష కేంద్రంలో 144 సెక్షన్ విధించారు. పరీక్ష రాసే విద్యార్థులకు అధికారులు మంచినీటి వసతితో పాటు అత్యవసర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచారు. మొదటి రోజు ప్రశాంతంగా పరీక్ష ముగిసింది.