News March 2, 2025
గరివిడి: చికిత్స పొందుతూ మహిళ మృతి

విజయనగరం జిల్లాలో చుట్ట వలన మహిళ ప్రాణం పోయింది. గరివిడి మండలం గొట్నింద గ్రామానికి చెందిన బొడ్డు బండమ్మ(70) పడుకునే ముందు తను కాల్చిన చుట్టను మంచంపై పెట్టింది. దీంతో అగ్నిప్రమాదం జరగ్గా ఆమె తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. ఈ ఘటనపై గరివిడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 18, 2025
VZM: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా తమ సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 283 మంది మందుబాబులపై కేసులు నమోదు చేసారన్నారు. వాహన తనిఖీలు చేపట్టిన పోలీసు అధికారులు రహదారి భద్రత నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు ఈ-చలానాలను విధించారని తెలిపారు. ఇకనైనా పద్ధతులను మార్చుకొవాలన్నారు.
News March 17, 2025
పకడ్బంధీగా పదోతరగతి పరీక్షలను నిర్వహించాలి: కలెక్టర్

పకడ్బంధీగా పదోతరగతి పరీక్షలను నిర్వహించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. సోమవారం నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో, పలు పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ముందుగా కంటోన్మెంటులో సెయింట్ ఆన్స్ బాలికోన్నత పాఠశాలను, మున్సిపల్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. తరగతి గదులను పరిశీలించారు.
News March 17, 2025
గుర్లలో నకిలీ ఏసీబీ డీఎస్పీ బెదిరింపులు

గుర్ల మండలంలో పలువురు అధికారులను గుర్తు తెలియని ఓ నకిలీ ఏసీబీ అధికారి హడలెత్తించినట్లు సమాచారం. తాను ఏసీబీ DSPని అంటూ పరిచయం చేసుకొని డబ్బులు డిమాండ్ చేశాడు. పలువురు అధికారులకు ఆదివారం ఫోన్ చేసి మీరు అవినీతికి పాల్పడుతున్నారని, అరెస్ట్ చేస్తామంటూ బెదిరింపులకు దిగాడు. రూ.2లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని గుర్ల SI నారాయణరావు తెలిపారు.