News June 23, 2024

గరుగుబిల్లి: తోటపల్లి సమీపంలో ఏనుగుల గుంపు

image

గరుగుబిల్లి మండలం తోటపల్లి పంప్ హౌస్ సమీపంలో ఏడు ఏనుగులు గుంపుగా సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది తెలిపారు. సమీప ప్రాంతం ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ముఖ్యంగా రైతులు పంట పొలాలకు వెళ్లే సమయంలో ఏనుగులు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని కోరారు. వ్యవసాయ క్షేత్రాలలో పశువులను ఉంచరాదన్నారు.

Similar News

News October 26, 2025

విజయనగరంలో 4 ప్రైవేట్ బస్సులు సీజ్

image

నగరంలో రవాణా శాఖాధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఉపరవాణా కమిషనర్ మణికుమార్, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లతో కలసి వాహన రికార్డులు, ఫైర్ ఎక్విప్మెంట్, సీటింగ్‌ బెర్త్‌లను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిని 4 వాహనాలను సీజ్ చేసి ఆర్టీఓ కార్యాలయానికి తరలించారు.

News October 26, 2025

VZM: జిల్లాలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు

image

తుఫాన్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కంట్రోల్ రూములను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు.
కలెక్టర్ ఆఫీస్: 08922-236947, 8523876706
VZM రెవెన్యూ డివిజినల్ ఆఫీస్: 8885893515
చీపురుపల్లి రెవెన్యూ డివిజనల్ ఆఫీస్: 9704995807
బొబ్బిలి రెవెన్యూ డివిజనల్ ఆఫీస్: 9989369511
విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్: 9849906486
AP EPDCL: 9490610102
టోల్ ఫ్రీ నంబర్ 1912ని సంప్రదించాలన్నారు.

News October 25, 2025

VZM: ఒకేచోట ఆధ్యాత్మికత.. పర్యాటకం

image

విజయనగరం మండలం సారిక గ్రామంలోని కాళీమాత దేవాలయం, రామబాణం ఆకారంలో ఉన్న రామనారాయణం దేవాలయం పక్కనే ఉండటంతో ఆధ్యాత్మిక సందర్శకుల కేంద్రంగా మారింది. కార్తీక మాసంలో భక్తులు ఒకేసారి రెండు పుణ్య క్షేత్రాలను దర్శించుకునే అరుదైన అవకాశం లభిస్తోంది. దీంతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. భక్తులు కాళీమాత ఆశీస్సులు, శ్రీరామచంద్రుడి కృప ఒకే చోట పొందుతున్నారు.