News April 5, 2025
గరుగుబిల్లి: ‘రైతులు నూతను పద్ధతులు పాటించాలి’

జిల్లాలో వ్యవసాయ, ఉద్యానవన రంగాలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర వద్ద గల డా.వై.యస్.ఆర్ ఉద్యానవన కళాశాలలో ఖరీఫ్ పంటల సాగులో ముందస్తు ఏర్పాట్లపై కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..నూతన పద్ధతులను అవలంభించి లాభసాటి పంటలు సాగు చేసి రైతులు అధిక ఆదాయం ఆర్జించాలని కోరారు.
Similar News
News December 3, 2025
కోకాపేటలో ఎకరం రూ.131 కోట్లు

కోకాపేట్ నియోపోలిస్ భూముల వేలం ముగిసింది. నగరానికి చెందిన యూలా గ్రూప్ నాలుగు ఎకరాల ప్లాటును వేలంలో సొంతం చేసుకుంది. ఎకరానికి రూ.131 కోట్లు వెచ్చించింది. నియోపోలిస్ నుంచి గండిపేట్ వ్యూ కనిపిస్తుండటంతో ఇక్కడి కమ్యూనిటీని డెవలప్ చేసే అవకాశం ఉంటుందని, అందుకే ఈ నాలుగు ఎకరాలను ఆన్లైన్ వేలంలో యూలా గ్రూప్ కొనుగోలు చేసినట్లు తెలిసింది.

బంగారిగడ్డ ఎన్నికలు.. ఫిర్యాదుతో యథావిధిగా పోలింగ్

చండూరు మండలం బంగారిగడ్డ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నిక వివాదాస్పదమైంది. అభ్యర్థిని ఏకగ్రీవంగా నిర్ణయించినా, కొందరు వ్యక్తులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికలను యథావిధిగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులను ఎంపిక చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. త్వరలో పోలింగ్ నిర్వహించనున్నారు.