News July 28, 2024
గరుగుబిల్లి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ఏలూరులో శనివారం ఉదయం ఆగి ఉన్న లారీని ప్రైవేటు బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో గరుగుబిల్లి మండలం పెద్దూరుకు చెందిన కృష్ణమ్మ(60) మృతి చెందారు. పార్వతీపురం జిల్లాకు చెందిన 31 మంది భక్త బృందం విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి ఓ ప్రైవేట్ బస్సులో బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలవర్రు వద్ద ఆగిన లారీని బస్సు ఢీకొనడంతో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Similar News
News November 24, 2025
రాజాం: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

అనుమానాస్పద స్థితిలో వివాహిత ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన రాజాం సారధి రోడ్డులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. రాజాంలో ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తున్న ఉర్లాపు సావిత్రి (30) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సావిత్రి ఉరి వేసుకుని మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతురాలికి భర్త, కొడుకు, కుమర్తె ఉన్నారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
News November 24, 2025
డిసెంబర్ 5న APNGGO కొత్తవలస యూనిట్ ఎన్నికలు

కొత్తవలసలోని APNGGO యూనిట్ ఎన్నిక డిసెంబర్ 5 న నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు K.ఆదిలక్ష్మి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సహాయ ఎన్నికల అధికారిగా యెర్రా రమణ, ఎన్నికల పరిశీలకులుగా ఆనంద్ కుమార్ వ్యవహరిస్తారన్నారు. ఈనెల 28న నామినేషన్ వేయాలని, కొత్తవలస, వేపాడ ఎల్కోటలో ఉన్న ఉద్యోగస్తులు ఈ అవకాశం వినియోగించుకోవాలన్నారు.