News October 24, 2024
గర్భం దాల్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు

ఓ బాలిక గర్భం దాల్చిన ఘటన అన్నమయ్య జిల్లాలో వెలుగుచూసింది. పోలీసుల వివరాల మేరకు.. కురుబలకోటకు చెందిన 16 ఏళ్ల బాలిక మదనపల్లెలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. లక్కిరెడ్డిపల్లికి చెందిన ఓ యువకుడు (24), బాలిక మధ్య కొన్ని నెలలుగా ప్రేమ వ్యవహారం నడిచింది. ఈ క్రమంలో బాలిక గర్భందాల్చింది. గురువారం ఉదయం బాలిక తల్లి పసిగట్టి ముదివేడులో ఫిర్యాదు చేయగా పోలీసులు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
Similar News
News October 26, 2025
చిత్తూరు జిల్లా స్పెషల్ అధికారిగా గిరీష నియామకం

మొంథా తుఫాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు జిల్లాకు స్పెషల్ ఆఫీసర్గా పీఎస్ గిరీషను నియమించింది. వర్షాల ప్రభావం తగ్గే వరకు ఆయన విధుల్లో ఉండనున్నారు. జిల్లాకు వాతావరణశాఖ ఆరంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
News October 26, 2025
నేడు పని చేయనున్న విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు

జిల్లాలోని విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు ఆదివారం కూడా పనిచేస్తాయని ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. సెలవు రోజు అయినప్పటికీ వినియోగదారుల సౌకర్యం కోసం విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాలు తెరిచి ఉంటాయని ఆయన వెల్లడించారు. దీనిని సద్వినియోగం చేసుకొని విద్యుత్ బిల్లులు చెల్లించాలని కోరారు.
News October 26, 2025
చిత్తూరు: సహాయక చర్యలకు రూ. 2 కోట్ల కేటాయింపు

భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర సహాయక చర్యలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున కేటాయించింది. ఈ నిధుల్ని వరద ప్రాంతాల నుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, ఆహారంతో పాటు మంచి నీళ్లు అందించేందుకు, మెడికల్ క్యాంపుల ఏర్పాటు చేసేందుకు. రోడ్లతో పాటు అవసరమైన వసతుల పునరుద్ధరించేందుకు ఉపయోగిస్తామని అధికారులు తెలిపారు.


