News April 15, 2025

గర్భిణీలు ఫోన్ వస్తే లిఫ్ట్ చెయ్యండి: DMHO

image

గుంటూరు DMHO కాన్ఫరెన్స్ హాలులో Dr. K. విజయలక్ష్మి అధ్యక్షతన మంగళవారం ఆశా నోడల్ ఆఫీసర్స్ సమావేశం జరిగింది. DMHO మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కిల్కారి ప్రోగ్రామ్‌ను గర్భిణీ, బాలింతల కోసం ప్రవేశ పెట్టిందన్నారు. గర్భిణీకి 4నెల నుంచి బిడ్డకు ఒక సంవత్సవరం వచ్చే వరకు కిల్కారి ఫోన్ కాల్స్ (01244451660/14423) లిఫ్ట్ చేస్తే పూర్తి సమాచారాన్ని వినగలుగుతారన్నారు. ఈ సేవలను బాలింతలు ఉపయోగించుకోవాలని కోరారు.

Similar News

News July 7, 2025

వికేంద్రీకరణ పద్ధతిలో PGRS అమలు: కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) సోమవారం నుంచి మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిల్లో కూడా అమలు కానుందని కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులు సమీప మండల, డివిజనల్, మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించుకోవచ్చని ఆమె సూచించారు. ఇలా నిర్వహించడం వల్ల పాలన ప్రజలకు చేరువ అవుతుందన్నారు. ఈ అవకాశాన్ని ఫిర్యాది దారులు ఉపయోగించుకోవాలన్నారు.

News July 6, 2025

ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడండి: ఎస్పీ

image

గుంటూరు నగరంలో శంకర్ విలాస్ ఆర్వోబీ పనులు జరుగుతున్న నేపథ్యంలో చేపట్టిన ట్రాఫిక్ మళ్లింపులను ఎస్పీ సతీశ్ కుమార్ ఆదివారం పరిశీలించారు. వాహనాల రాకపోకల రద్దీ ఎక్కువగా ఉండే రహదారులు, ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్ మళ్లింపులు వద్ద తగినంత మంది ట్రాఫిక్ సిబ్బందిని కేటాయించి సమన్వయం చేసుకోవాలన్నారు. సమాచార వ్యవస్థతో ప్రణాళిక బద్దంగా ట్రాఫిక్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.

News July 6, 2025

తెనాలి: టెలిగ్రామ్ యూజర్లకు డీఎస్పీ జనార్ధనరావు హెచ్చరిక

image

వాట్సాప్, టెలిగ్రామ్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని తెనాలి డీఎస్పీ జనార్ధనరావు సూచించారు. ‘apk’ ఫైల్స్, ప్రభుత్వ అధికారుల గ్రూపుల్లో చేరమంటూ వచ్చే సందేశాలను నమ్మవద్దని కోరారు. వీటిని డౌన్‌లోడ్ చేస్తే ఫోన్ నేరగాళ్ల వశమై, యాప్‌ల నుంచి నగదు తస్కరిస్తారని హెచ్చరించారు. మీ స్నేహితులకు మీ తరఫున మెసేజ్‌లు పంపి ఫోన్‌ను హ్యాక్ చేస్తారని తెలిపారు.