News April 11, 2025
గర్భిణీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్

జిల్లాలో మాతృ మరణాలు జరగకుండా గర్భిణీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి తగుసూచనలు, సలహాలు, వైద్యసాయం అందించాలని HYD కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వైద్య ఆరోగ్యశాఖ వైద్యులు, సిబ్బందికి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ మాట్లాడుతూ.. గర్భిణీలకు సేవలు మెరుగుపరచాలని, వారి ఆరోగ్యంపై ANMలో ఆశా వర్కర్లు, ఫాలోఅప్ చేయాలన్నారు.
Similar News
News February 24, 2026
నాగోల్: బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో ఘరానా మోసం: బాధితుడు

నాగోల్ PS పరిధి అల్కాపురి బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో ఘరానా మోసం జరిగిందని వికలాంగుడైన బాధితుడు ఆరోపించారు. కొత్త మొబైల్ పేరిట పాత ఫోన్ అంటగట్టినట్లు ఆయన వాపోయారు. తనకు న్యాయం చేయాలని షోరూమ్ ముందు నిరసనకు దిగగా.. సిబ్బంది బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. వినియోగదారుల హక్కులను కాలరాసే ఇలాంటి వ్యవహారాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని షోరూమ్ ముందు బైఠాయించారు.
News February 24, 2026
మరికొన్ని గంటల్లో HYDలో భారీ వర్షం

నగరంలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే కొన్ని గంటల్లో నగరమంతా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని మ్యాప్ విడుదల చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచించారు.
News February 23, 2026
RR: ఉగ్గుపాల నుంచే ఒగ్గు కథల వైపు మల్లారి!

ఒగ్గు కథ చెప్పడం మగాళ్లకే పరిమితమైన రోజుల్లో ఓ మహిళ కథ చెప్పడానికి బయలుదేరింది. రంగారెడ్డి(D),యాచారం(M), నక్కర్త మేడిపల్లికి చెందిన జమ్మ మల్లారి. ఈమె వేలకొద్దీ బీరప్ప కళ్యాణాలు చేసి, ఒగ్గు కథలు వినిపించి ఒగ్గుకథ ‘సూపర్‌స్టార్’గా ఎదిగారు. జీవితాన్ని ఒగ్గుకథకు అంకితం చేసి తొలి మహిళా ఒగ్గు కథా కళాకారిణిగా పేరుగాంచి 2020లో విశిష్ట మహిళా పురస్కారాన్ని అందుకుని FEB 7న ఆమె శివైక్యం చెందారు.


