News January 1, 2025

గర్భిణులకు పోషకాహారాన్ని అందించాలి: కలెక్టర్

image

100 శాతం గర్భిణులకు అనుబంధ పోషకాహారాన్ని అందించాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా ఐసీడీఎస్ పీడీని ఆదేశించారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ అంశాలపై మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులతో ఆ శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. బాల్యవివాహాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Similar News

News January 4, 2026

శ్రీ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో సినీ డైరెక్టర్

image

మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని సినిమా డైరెక్టర్ తేజ, టీడీపీ కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షుడు తిక్క రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. మంచాలమ్మ దేవి, మూల బృందావనాన్ని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శ్రీమఠం అధికారులు నరసింహమూర్తి, వ్యాసరాజస్వామి, పన్నగ వెంకటస్వామి పాల్గొన్నారు.

News January 4, 2026

రేవంత్ వ్యాఖ్యలపై చంద్రబాబు సమాధానం చెప్పాలి: ఎస్వీ

image

రాయలసీమలో ఎత్తిపోతల పథకాలను చంద్రబాబుతో కలిసి నిలిపేశామని అసెంబ్లీలో రేవంత్ చేసిన వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఎస్వీ కాంప్లెక్స్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఓటుకు నోటులో కేసీఆర్‌కు భయపడి చంద్రబాబు ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. సీమకు జరుగుతున్న అన్యాయంపై సీమ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు విప్పాలన్నారు.

News January 4, 2026

కర్నూలు కాంగ్రెస్ పార్టీ కొత్త బాస్ ఈయనే..!

image

కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిగా పత్తికొండ నియోజకవర్గ కోఆర్డినేటర్ క్రాంతి నాయుడు నియమితులయ్యారు. ఏపీలోని జిల్లా డీసీసీల అధ్యక్షుల నియామకాలకు ఏఐసీసీ అధ్యక్షుడు ఆమోదం తెలిపినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా చేపట్టిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ నియామకాలు చేసినట్లు తెలిపారు.