News April 7, 2025
గర్భిణులకు పౌష్టికాహార కిట్లు పంపిణీ చేసిన పవన్

గర్బిణులు పౌష్టికాహార కిట్లను సద్వినియోగించుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. డుంబ్రిగుడ(M) పెదపాడు గ్రామ సందర్శనలో భాగంగా గ్రామంలో ఉన్న గర్భిణులకు సీమంతం, శిశువులకు అన్నప్రాసన చేశారు. వారికి బాల సంజీవని కిట్లు, గుడ్లు, పప్పు, నూనె, రైస్, చిక్కీలను పవన్ పంపిణీ చేశారు. పౌష్టికాహారంతోనే తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మీ, సీడీపీఓ నీలిమ తదితరులు ఉన్నారు.
Similar News
News April 8, 2025
NZB: అనుముల ఇంటెలిజెన్స్‌తో రాష్ట్రానికి ప్రమాదం: కవిత

అనుముల ఇంటెలిజెన్స్‌తో రాష్ట్రానికి ప్రమాదం ఉందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో చాలా ప్రమాదముందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు.. అనుముల ఇంటెలిజెన్స్ అని ఎద్దేవా చేశారు. అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్పా రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనిపించడం లేదన్నారు.
News April 8, 2025
పవన్ అన్న కుమారుడు త్వరగా కోలుకోవాలి: మంత్రి లోకేశ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘పవన్ అన్న చిన్నకుమారుడు మార్క్ శంకర్‌కు గాయాలైన విషయం నాలో ఆందోళన కలిగించింది. బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు లోకేశ్ ట్వీట్ చేశారు.
News April 8, 2025
శ్రీలీలతో డేటింగ్.. బాలీవుడ్ హీరో ఏమన్నారంటే?

కుర్ర హీరోయిన్ శ్రీలీలతో ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ స్పందించారు. తనకు ఇండస్ట్రీలో గర్ల్ ఫ్రెండ్ లేదని చెప్పారు. తన గురించి వస్తున్న కథనాలపై స్పందించేందుకు చిత్ర పరిశ్రమలో బంధువులెవరూ లేరన్నారు. ప్రస్తుతం ఈ హీరో శ్రీలీలతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారని ప్రచారం జరిగింది.