News April 16, 2025
‘గల్ఫ్‌లో సోన్ మండల యువకుడి హత్య’

సోన్‌కు చెందిన హస్తం ప్రేమసాగర్ దుబాయ్‌లో హత్యకు గురయ్యారు. మృతదేహం అక్కడే ఉండిపోయింది. బాధిత కుటుంబానికి MLA ఏలేటి మహేశ్వర్ రెడ్డి భరోసా కల్పించారు. మంగళవారం సాయంత్రం విదేశాంగ మంత్రిత్వ శాఖ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాధికారులతో మాట్లాడినట్లు చెప్పారు. కుటుంబ సభ్యులు, నాయకులు జరిగిన ఘటనను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఇది సాధ్యమైందని వారు పేర్కొన్నారు.
Similar News
News November 23, 2025
చిత్తూరు: తండ్రి రిటైర్డ్ మిలిటరీ.. కొడుకు దొంగ

బెంగళూరు ATM చోరీ కేసులో <<18367776>>దోచుకున్న<<>> డబ్బులు దాచిపెట్టిన నవీన్ తండ్రి ఓ రిటైర్డ్ మిలిటరీ ఉద్యోగి. గ్రామంలో ఆయనకు మంచి పేరుంది. అయితే ఆయన ఇద్దరు కుమారులు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా స్థిరపడ్డారు. పెద్ద కుమారుడు నవీన్‌కు మూడు నెలల క్రితమే వివాహమైంది. ATM చోరీ కేసులో నవీన్ ఇంట్లో దాచిపెట్టిన రూ.5.60 కోట్లను స్వాధీనం చేసుకున్న కర్ణాటక పోలీసులు అతడిని ఇదివరకే అరెస్ట్ చేశారు.
News November 23, 2025
విశాఖ ప్రభుత్వ కార్యాలయాలలో రేపు PGRS: CP

విశాఖ సీపీ కార్యాలయంలో ఈనెల 24న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు సీపీ శంకబ్రత బాగ్చి తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. కలెక్టరేట్, GVMC ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు వినతులు స్వీకరిస్తారన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News November 23, 2025
ఈ రిలేషన్షిప్ ట్రెండ్స్ గురించి తెలుసా?

జెన్ జి కిడ్స్ ప్రతి వ్యక్తితోనూ వారికున్న రిలేషన్‌కి విచిత్రమైన పేర్లు పెట్టేసి ట్రెండ్ చేస్తున్నారు. వాటిల్లో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
* ఎవాల్యూషన్షిప్-ఈ రిలేషన్లో ఉన్నవారు మొదట్లో మామూలుగానే ఉంటారు. పోనుపోనూ వారి అనుబంధం బలపడుతుంది. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్తారు.* బెంచింగ్షిప్- ఈ రిలేషన్షిప్లో ఒకరితో ఒకరు పూర్తిగా సంబంధాన్ని పెంచుకోరు, అలాగని తెంచుకోరు.


